శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Medchal - Jan 24, 2021 , 04:22:06

స్వచ్ఛసర్వేక్షణ్‌-2021పై అవగాహన ర్యాలీ

స్వచ్ఛసర్వేక్షణ్‌-2021పై అవగాహన ర్యాలీ

దుండిగల్‌,జనవరి23: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తడి, పొడి చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేయాలని దుండిగల్‌ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్‌ బండారు మహేందర్‌యాదవ్‌ అన్నారు. డీ.పోచంపల్లిలోని పలు వీధుల్లో శనివారం స్వచ్ఛసర్వేక్షణ్‌-2021పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలకు తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శానిటరీ అధికారి కరుణాకర్‌రెడ్డి, యువనాయకులు శ్రీకాంత్‌యాదవ్‌, సురేశ్‌, హరిప్రసాద్‌, జయరాం, తిరుపతి, కిషన్‌, శ్రీను, వెంకట్‌ పాల్గొన్నారు.

నిజాంపేట స్ప్రింగ్‌విల్లే కాలనీలో..

నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి స్ప్రింగ్‌విల్లే కాలనీలో సంక్షేమసంఘం ప్రతినిధులు స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం సంక్షేమ సంఘం ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంక్షేమసంఘం ప్రెసిడెంట్‌ అస్కాని మారుతిసాగర్‌, సభ్యులు సుదర్శన్‌రెడ్డి, గోపి, రమేశ్‌, వీరేందర్‌గౌడ్‌, నరేందర్‌రెడ్డి, శశిధర్‌, హరి, వాసు, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo