పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి

- విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
- ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశం
మేడ్చల్, జనవరి 19: (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అవసరమైనన్ని ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి తొమ్మిది, 10వ తరగతుల విద్యార్థులకు ఆఫ్‌లైన్ క్లాస్‌లు ప్రారంభం కానున్న దృ ష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాం బర్లో మంగళవారం జిల్లా విద్యాశాఖ, సంక్షేమ శాఖాల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలలో మిగతా తరగతులు జరగకుండా తొమ్మిది, 10వ తరగతులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించేందు కు ప్రభుత్వం పరంగా అన్ని ఏర్పాట్లు చేప డుతున్నారన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందు పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులు మాత్ర మే ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థి మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్త పడాలన్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎన్వోసీ విధిగా తీసుకోవాలన్నా రు. విద్యార్థి అస్వస్థకు గురైతే పీపీఈ కిట్ ధరించి స్థానిక దవాఖానాలకు తీసుక వెళ్లి చికిత్స అందించాలన్నారు. పాఠశాలలో రెండు ఐసోలేషన్ గదులుండాలన్నారు.
వసతి గృహాల విద్యార్థులపై దృష్టి
వసతి గృహాలలో ఉండే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి విద్యార్థికి విడివిడిగా సబ్బులు, బెడ్‌షీట్స్‌ను అందుబాటులో ఉంచాలని, ప్రతిచోట కొవిడ్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, విద్యాశాఖ అధికారిణి విజయలక్ష్మీ, డీపీఓ పద్మజరాణి, బీసీ సం క్షేమ అధికారిణి ఝాన్సి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి షత్రు నాయక్ పాల్గొన్నారు.
ధరణిలో రిజిస్ట్రేషన్లు పెండింగ్ లేకుండా చేయాలి: కలెక్టర్
ధరణిలో రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో లేకుండా చేయాలని కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ధరణిపై ఆర్డీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. జిల్లాలోని తహశీల్దార్లు మ్యూటేషన్ చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇబ్బందులు ఏమైనా వస్తే వెంటనే ఆర్డీవోలకు సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వం రెవెన్యూ శాఖాలో అనేక మార్పులు తీసుకువచ్చి ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు. పెం డింగ్‌లో ఉన్న వంద మ్యూటేషన్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ధరణిలో రైతులు చేసుకున్న వ్యవసాయ భూము ల రిజిస్ట్రేన్లు వందశాతం పూర్తి చేసామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, డీఆర్వో లింగ్యానాయక్ ఆర్డీవోలు మల్లయ్య, రవి, పలువురు తహశీల్దార్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఓలా ఫ్యూచర్ మొబిలిటీ.. 2 సెకన్లకో ఈ-స్కూటర్
- హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
- రావణ వాహనంపై ఊరేగిన శ్రీశైలేషుడు..
- స్కూల్ గోడ కూలి.. ఆరుగురు కూలీలు మృతి
- హెబ్బా పటేల్ తలను ‘తెలిసిన వాళ్లు’ ఏదో చేసారబ్బా..!
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే..!
- మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా కేసులు.. 22 మరణాలు
- పారితోషికం భారీగా పెంచిన నాని!
- నల్లగొండకు చేరిన ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు
- జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల