శనివారం 27 ఫిబ్రవరి 2021
Medchal - Jan 19, 2021 , 23:34:52

ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిన టీకా

ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిన టీకా

కంటోన్మెంట్‌,జనవరి 19: కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిందని, అందరికీ కొవిడ్‌ టీకా అందజేస్తామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి భరోసా ఇచ్చారు. బోయిన్‌పల్లి ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో మంగళవారం టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయ న్న, కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు సీఈవో అజిత్‌రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. తొలుత ప్రభుత్వ నర్సు లావణ్యకు టీకా వేయించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తొలివిడుతగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన ఆరోగ్య శాఖ, అంగన్‌వాడీ విభాగాల్లో వైద్యులు, నర్సు లు, ఉద్యోగులు అన్ని విభాగాల సిబ్బందికి టీకా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తొలిరోజు టీకా వేస్తున్న మూడు కేంద్రాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 139కిపైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుందని తెలిపారు. ఒకవేళ ప్రైవేట్‌ కేంద్రాల్లో కూడా వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలన్నా ప్రభుత్వ వైద్యులే టీకా వేస్తారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపుతూ వ్యాక్సినేషన్‌ విజయవంతానికి చర్యలు చేపట్టారని తెలిపారు.

కంటోన్మెంట్‌ ప్రాంతంలో అధికార యంత్రాంగంతో పాటు వైద్య, పోలీస్‌, పారిశుధ్య కార్మికులు, రెవెన్యూ, అంగన్‌వాడీ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎంతో శ్రమించిందని గుర్తు చేశారు. అనంతరం మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కేంద్రంలో ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉం టూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తారని చెప్పారు. దీంతో పాటు తిరుమలగిరిలోని పీహెచ్‌సీతో పాటు పికెట్‌లోని డిస్పెన్సరీలో టీకాను వేశారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు సదా కేశవరెడ్డి, పాండుయాదవ్‌, నళినికిరణ్‌, మాజీ సభ్యులు ప్రభాకర్‌, బోయిన్‌పల్లి మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌, సికింద్రాబాద్‌ గణపతి ఆలయం మాజీ చైర్మన్‌ నగేశ్‌, బోర్డు అధికారులు దేవేందర్‌, మహేందర్‌, ఎస్‌పీహెచ్‌వో రాజకుమారి,  వైద్యులు షరీఫ్‌, మీనా, దీప్తిలతో సహా నేతలు పనస సంతోష్‌, విజయ్‌, అనిల్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. 

తొలిరోజు 71 మందికి టీకా  

కంటోన్మెంట్‌లో మంగళవారం 71 మందికి టీకా వేసినట్లు సీనియర్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌(ఎస్‌పీహెచ్‌వో) రాజకుమారి వెల్లడించారు. కంటోన్మెంట్‌లోని మూడు కేంద్రాల్లో 196 మందికి టీకా వేయాలని ప్రణాళిక సిద్ధం చేయగా, బోయిన్‌పల్లి కేంద్రంలో 39 మందికి గాను18 మందికి, తిరుమలగిరిలో 114 మందికి గాను 41 మందికి, పికెట్‌లో 43 మందికి గాను 12 మందికి టీకా వేశారు. ఈ మూడు కేంద్రాల్లో అనారో గ్య సమస్యల వల్ల సుమారు 92 మంది వ్యాక్సిన్‌ వేసుకోవడానికి రాలేదన్నారు. 

నిర్భయంగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సి న్‌ వేయించుకోవా లి. నేను కూడా వ్యా క్సిన్‌వేయించుకు న్నా. ఎటువంటి రి యాక్షన్‌ లాంటివి చోటు చేసుకోలేదు. వ్యాక్సినేషన్‌ అనంతరం విధుల్లో పాల్గొ న్నా. టీకా వల్ల ఎలాంటి దుష్పలితాలు ఉండవు. కరోనా నుంచి ప్రజలను రక్షించడం కోసం టీకాను త్వరగా అందించిన ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు.    - పిట్ట లావణ్య, స్టాఫ్‌నర్సు, బోయిన్‌పల్లి యూపీహెచ్‌సీ.  

VIDEOS

logo