పేదల సంక్షేమానికి పెద్దపీట

కీసర, జనవరి 19 : పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నర్సింహకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.41వేల చెక్కును మంగళవారం మంత్రి ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద ఎంతో మంది పేదలు లబ్ధి పొందుతున్నారన్నారు. పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప వరమని చెప్పారు.కార్యక్రమంలో తిమ్మాయిపల్లి సర్పంచ్ పెంటయ్య, టీఆర్ఎస్ నేతలు నాయకపు వెంకటేశ్‌ముదిరాజ్, కందాడి అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పలు సమస్యలపై మంత్రికి వినతి..
కీసర మండల పరిధిలోని గ్రామాల సర్పంచులు మంగళవారం మంత్రి మల్లారెడ్డిని ఆయన నివాసంలో కలిసి పలు సమస్యలను విన్నవించారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి పలు శాఖలకు సంబంధించి నిధులను మంజూరు చేస్తున్నదని తెలిపారు. గ్రామాల్లో ఎన్ని పనులైనా చేసుకోవడానికి ఆస్కారం ఉందని, దాతల నుంచి నిధులను సేకరించుకొని సమస్యల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. మంత్రిని కలిసిన వారిలో సర్పంచ్‌లు మాధురి వెంకటేశ్, మహేందర్‌రెడ్డి, ధర్మేందర్, పెంటయ్య, రాజుముదిరాజ్, కవితాజైహింద్రెడ్డి, సత్తమ్మ, ఆండాలుమల్లేశ్, గోపాల్‌రెడ్డితో టీఆర్ఎస్ నేతలు వెంకటేశ్ ముదిరాజ్, మల్లేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- స్టన్నింగ్ లుక్‌లో నాగార్జున.. పిక్ వైరల్
- ఆస్ట్రేలియాలో బస్‌డ్రైవర్‌గా మారిన శ్రీలంక క్రికెటర్
- కూలీలతో కలిసి ప్రియాంక తేయాకు సేకరణ..వీడియో
- ధర్మపురిలో ‘సంకష్ట చతుర్థి’ పూజలు
- టీకా తీసుకున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఎంపీ కేశవరావు, ఫారూక్ అబ్దుల్లా
- మాల్దీవులలో బిపాసా అందాల ఆరబోత మాములుగా లేదు..!
- అసోం, అండమాన్‌లో కంపించిన భూమి
- ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కూ బుమ్రా దూరం!
- బెయిల్‌పై వచ్చి లైంగిక వేధింపుల బాధితురాలి తండ్రిని కాల్చిచంపి..!
- టైగర్ ష్రాఫ్ బర్త్‌డే .. పార్టీలో మెరిసిన దిశా పటానీ