మంగళవారం 09 మార్చి 2021
Medchal - Jan 18, 2021 , 03:42:26

పేదల సంక్షేమమే లక్ష్యం

పేదల సంక్షేమమే లక్ష్యం

మేడ్చల్‌  : నిరుపేదల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అదివారం దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలోని అహ్మద్‌గూడ 5వ వార్డుకు చెందిన సూర్యకు రూ.60 వేలు, నర్సయ్యకు రూ. 60 వేలు, నాగారం మున్సిపల్‌ పరిధిలోని రాంపల్లికి చెందిన మురళీకి రూ.లక్ష  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు మంత్రి ఆయన నివాసంలో ఆదివారం చెక్కులను అందజేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిరుపేదలకు వరమని మంత్రి పేర్కొన్నారు. మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌  అధ్యక్షుడు కౌకుట్ల తిరుపతి రెడ్డి, కౌన్సిలర్లు వెంకటేశ్‌, నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, భాస్కర్‌ గౌడ్‌, పాండు పాల్గొన్నారు.

VIDEOS

logo