శుక్రవారం 05 మార్చి 2021
Medchal - Jan 17, 2021 , 06:38:48

పని ఉందని తీసుకెళ్లి దోపిడీ..

పని ఉందని తీసుకెళ్లి దోపిడీ..

  • ఆభరణాలు ఉన్న మహిళలనే టార్గెట్‌ చేస్తారు..
  • కల్లు కాంపౌండ్‌లో మాటలు కలిపి  ఫోన్‌ నంబర్‌ సేకరిస్తారు..
  • నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. ఆభరణాలు లాక్కొంటారు
  • ఇద్దరు నిందితులు, వారికి సహకరించిన మరొకరు అరెస్ట్‌

ఘట్‌కేసర్‌ రూరల్ : బంగారు ఆభరణాలను ధరించి ఒంటరిగా కల్లు కాంపౌండ్‌లకు వచ్చే మహిళలనే టార్గెట్‌ చేస్తారు... మాటలు కలిపి వివరాలు, ఫోను నంబర్లు తీసుకుంటారు.. ఆ తర్వాత ఫోన్‌చేసి పని ఉందని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆభరణాలను అపహరిస్తారు.. ఇలా.. దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు.. వారికి సహకరిస్తున్న మరొకరిని ఘటకేసర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఏసీపీ శ్యాంప్రసాద్‌ రావుతో కలిసి వివరాలు వెల్లడించారు. అంబర్‌పేట, గోల్నాక, శ్రీలంక కాలనీలో నివాసం ఉండే  గడ్డమీది ప్రేమలత(45) స్థానికంగా కూలీ  పనులు చేసుకుంటుంది. ఈ నెల 9న సాయంత్రం నాలుగు గంటలకు బోడుప్పల్‌ లక్ష్మీనగర్‌ కాలనీకి చెందిన డ్రైవర్‌ పస్తం హరికృష్ణ.. ఆమెకు ఫోన్‌చేసి మేడిపల్లి ఫంక్షన్‌ హాల్‌ లో పని ఉంది రావాలని చెప్పగా ఆమె వెళ్లింది.  అక్కడి నుంచి ఆమెను తీసుకుని నారపల్లికి వెళ్లాడు. అక్కడ వారికి న్యూ నల్లకుంటకు చెందిన సముద్రాల రేణుక కలిసింది. ముగ్గురు కలిసి మద్యం తా గారు. అనంతరం ఘట్‌కేసర్‌ పోలీసు స్టేష న్‌ పరిధిలోని చౌదరిగూడ పంచాయతీ, మక్త గ్రామ పరిధిలోని మూసినది ఒడ్డుకు చేరుకుని మళ్లీ మద్యం తాగారు..  ఈ క్రమంలో ప్రేమలత ఒంటిపై ఉన్న బంగా రు చెవి కమ్మలు, మాటీలు, నాలుగు తులాల పుస్తెల తాడు, గుండ్లు లాక్కుని ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు.  బాధితురాలి ఫిర్యాదుతో. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. విచారణలో.. ఇంతకు ముందే రేణుకతో హరికృష్ణకు పరిచయం ఉందని, ఇద్దరు కలిసి కల్లు కాంపౌండ్‌లకు వెళ్లి బంగారు, వెండి ఆభరణాలు కలిగి ఉన్న ప్రేమలతను స్థానిక కల్లు కాంపౌండ్‌లో గుర్తించి..  మాటలు కలిపి వివరాలు సేకరించారని తేలింది. దోపిడీ చేసిన నగలను హరికృష్ణ భార్య రేణుకతో కలిసి షాద్‌నగర్‌లోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కుదువపెట్టి డ బ్బులు తీసుకున్నారని తేలింది. ఈ ముగ్గురిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. 

VIDEOS

logo