బుధవారం 24 ఫిబ్రవరి 2021
Medchal - Jan 17, 2021 , 04:04:04

వ్యాక్సిన్‌పై భయం వద్దు

వ్యాక్సిన్‌పై భయం వద్దు

దుండిగల్‌, జనవరి16: యావత్‌ ప్రపంచదేశాలను వణికించిన కరోనాను అంతమొందించేందుకు వచ్చిన కరోనా వ్యాక్సిన్‌పై ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు అన్నారు. శనివారం దేశవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైన కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాను కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని సూరారం డివిజన్‌ పరిధిలోని షాపూర్‌నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్యాధికారులు హాజరై అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా విపత్కర సమయంలో పోలీసులు, వైద్య రంగం సిబ్బంది చేసిన సేవలు ఎనలేనివని, ముందస్తుగా దానిలో భాగంగానే కొవిడ్‌ వారియర్స్‌కు ఈ టీకాను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ఈ వ్యాక్సిన్‌ యూరోపియన్‌ దేశాల్లో చక్కగా పని చేస్తున్నదని, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకుండా రిపోర్టులు వచ్చాయని, కావునా దీనిపై ప్రజలు ఎవరూ చింత లేకుండా టీకాను వేయించుకొని కరోనాను ఖతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారియర్స్‌ ధైర్యంగా ముందుకు రావాలన్నారు. మొదటి రోజున మొదటి టీకాను సీడీపీఓ ఎప్సిభాకు టీకాను వేసిన అనంతరం ఆయా విభాగాలలో పని చేస్తున్న మరో 29 మందికి టీకాను వేశారు. నిజాంపేట మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, విజయ్‌శేఖర్‌గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ సురేశ్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి మల్లిఖార్జున్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.ఆనంద్‌, ఎంహెచ్‌ఓ నిర్మల, ఆర్‌డీఓ మల్లయ్య, తహసీల్దార్లు భూపాల్‌, మహిపాల్‌రెడ్డి, నిజాంపేట మేయర్‌ దుండిగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎంఎన్‌ఆర్‌ జ్యోతితో పాటు ఆయా క్లస్టర్ల వైద్యాధికారులు, సిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

11 సెంటర్ల ద్వారా టీకా..

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్‌, షాపూర్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న 11 సెంటర్ల ద్వారా ఈ టీకాను సోమవారం నుంచి ఇచ్చేందుకు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. దీనిలోభాగంగా ప్రతి రోజు ఒక్కో కేంద్రానికి 30 వయోల్స్‌ను ఒక్క వయోల్స్‌లో 10 మందికి టీకాను ఇచ్చేందుకు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే నియోజకర్గంలో కేటాయించిన 11 సెంటర్ల ద్వారా మొదటి విడుతగా గుర్తింపు పొందిన 1845 మందికి ఈ వ్యాక్సిన్‌ టీకాను అందించనున్నారు. రెండో దశలో ప్రజలకు నిర్వీరామంగా అందించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. 

VIDEOS

logo