బుధవారం 24 ఫిబ్రవరి 2021
Medchal - Jan 17, 2021 , 04:00:17

నంబర్‌ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా

నంబర్‌ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా

ఉప్పల్‌,   : నంబర్‌ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులపై ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝులిపించారు. ఉప్పల్‌రింగ్‌రోడ్డులో ఉప్పల్‌ ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. నంబర్‌ప్లేట్లులేని వాహనాలను నిలిపి 26 కేసులు నమోదు చేశారు. నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలకు నంబర్‌ ప్లేట్లు బిగించారు. అనంతరం వాహనదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింగ్‌ యాదయ్య, కాశీ విశ్వనాథ్‌, ఎస్సై కృష్ణస్వామి, ఎస్సై శ్రీనివాస్‌రావు, వీరస్వామి, సత్యనారాయణ, హెడ్‌ కానిస్టేబుళ్లు వేణు, శ్యామ్‌, కుశలవరెడ్డి, రాంజీ, సుదర్శన్‌రెడ్డి, రమేశ్‌, సంధ్య పాల్గొన్నారు. 


VIDEOS

logo