మంగళవారం 02 మార్చి 2021
Medchal - Jan 17, 2021 , 03:57:27

విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్‌

విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్‌

ఉప్పల్‌,  : ఉప్పల్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, హబ్సిగూడ, మల్లాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శనివారం కొవిడ్‌-19 టీకాను ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల్‌లో పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ బోగ ప్రకాశ్‌కు కరోనా మొదటి టీకాను వేశారు. వ్యాక్సిన్‌ వేసుకున్న ప్రకాశ్‌ను ఎమ్మెల్యే అభినందించారు. నియోజకవర్గం పరిధిలో అందరికీ విడుతల వారీగా వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. కరోనాను అధిగమించే విధంగా టీకాదోహదపడుతుందని ఎమ్మెల్యే, వైద్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ అరుణకుమారి, కార్పొరేటర్లు బేతి స్వప్నారెడ్డి, గంధం జ్యోత్ననాగేశ్వర్‌రావు, పన్నాల దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్‌, గోపు సరస్వతి సదానంద్‌, బన్నాల గీతా ప్రవీణ్‌ ముదిరాజ్‌, వైద్యులు సౌందర్య లత, పూజ, స్వప్నిక, రవీనా, సిబ్బంది ప్రకాశ్‌, నేతలు వేముల సంతోశ్‌రెడ్డి, బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌, గరిక సుధాకర్‌, ఏదుల్ల కొండల్‌రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.  

నియోజకవర్గంలో ఏర్పాట్లు

చర్లపల్లి, జనవరి 16 : నియోజకవర్గంలోని అందరికీ విడుతల వారీగా టీకా వేస్తామని , ఇందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని జమ్మిగడ్డలో కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మొదటి టీకాను సిబ్బంది ఉషకు పీహెచ్‌సీ వైద్యురాలు స్వప్నారెడ్డి పర్యవేక్షణలో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నామని వివరించారు. వ్యాక్సినేషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ఆయన అన్నారు. 

అనంతరం ప్రధాని మోదీ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభంపై చేసిన ప్రసంగాన్ని ఆయన ఆరోగ్య సిబ్బందితో కలిసి వీక్షించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 30 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది గణేశ్‌, వెంకటేశ్వర్లు, కాప్రా మండలం ఆర్‌ఐ శాలిని, జవహార్‌నగర్‌ ఎస్సై సాయిలు, మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావు, టీఆర్‌ఎస్‌ ఏఎస్‌రావునగర్‌, కాప్రా డివిజన్ల అధ్యక్షులు బేతాల బాల్‌రాజు, సుడుగు మహేందర్‌రెడ్డి, నాయకులు శేకాసం మహిపాల్‌రెడ్డి, శేర్‌ మణెమ్మ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 


VIDEOS

logo