బుధవారం 27 జనవరి 2021
Medchal - Jan 13, 2021 , 00:42:54

అభివృద్ధి పథంలో మున్సిపాలిటీలు

అభివృద్ధి పథంలో మున్సిపాలిటీలు

మంత్రి చామకూర మల్లారెడ్డి 

మేడ్చల్‌ రూరల్‌, జనవరి 12 : టీఆర్‌ఎస్‌ హయాంలో మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంత్రి మంగళవారం రూ.2.06 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు.  గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీగా మారిన తర్వాత కోట్లాదిరూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కౌన్సిలర్లు మల్లికార్జున్‌ ముదిరాజ్‌, జైపాల్‌రెడ్డి, శ్రీలతాశ్రీనివాస్‌రెడ్డి, వీణాసురేందర్‌గౌడ్‌, రజితావెంకటేశ్‌, ఆంథోనమ్మ, రాజకుమారి, బేరిబాలరాజు, చింత పెంటయ్య, మాజీ సర్పంచ్‌ మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుధాకర్‌, ఫిలిప్స్‌, గౌస్‌ఖాన్‌, ఆదిత్యరాజ్‌ సింగ్‌, జనార్దన్‌రెడ్డి, కమిషనర్‌ అమరేందరెడ్డి, డీఈ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.


logo