కరోనా మహమ్మారి వలన షూటింగ్స్ అన్ని స్తంభించడంతో సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమి రావడం లేదు. దీంతో ఇటు సెలబ్రిటీలు అటు ఫ్యాన్స్ పాత జ్ఞాపకాలను మరోసారి సినీ ప్రేక్షకుల ముందుకు తెచ్చి వారిని ఆనందింపజేస్తున్నారు. తాజాగా చిన్న పిల్లల గ్రూప్‌కి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఇందులో ఇప్పటి హీరోయిన్ ఉంది. ఆమె ఎవరనే కదా మీ డౌట్..!
నితిన్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తెలుగు, తమిళం, మలయాళ భాషలలో అలరిస్తున్న అనుపమ ఇప్పుడు కూడా చిన్నప్పటి పోలికలతోనే ఉంది. ఆమె క్యూట్ ఫొటో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం అనుపమ 18 పేజెస్ అనే చిత్రంలో నిఖిల్ సరసన నటిస్తుంది.ఇటీవల నిఖిల్‌ని అనుమప ఆట పట్టిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇది నెటిజన్స్‌ని ఆకట్టుకుంది.