ఆదివారం 24 జనవరి 2021
Medchal - Dec 06, 2020 , 06:43:46

ముగిసిన గ్యాస్‌ టెస్టింగ్‌ శిక్షణ

 ముగిసిన గ్యాస్‌ టెస్టింగ్‌ శిక్షణ

 మేడ్చల్‌ రూరల్‌ : విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో పాటు అనుబంధంగా సమాజంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవాలని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ రామస్వామి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో మైనింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులకు రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికేషన్‌ శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. గనుల భద్రత విశ్రాంత ఉప సంచాలకుడు రంగనాథీశ్వర్‌, ఎస్‌ఎంఎస్‌ మైనింగ్‌ సంస్థ ఉపాధ్యాయుడు రామచంద్రరావు మాట్లాడుతూ గ్యాస్‌ టెస్టింగ్‌ ఆవశ్యతకను వివరించారు. 35 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. కార్యక్రమంలో హెచ్‌వోడీ శ్రీనివాస్‌, కళాశాల పరిశ్రమ వ్యవహారాల డీన్‌ డాక్టర్‌ వెంకట్రామయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.


logo