శనివారం 23 జనవరి 2021
Medchal - Dec 02, 2020 , 06:45:51

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

గాజులరామారం: గాజులరామారం సర్కిల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి ఓటింగ్‌ మందకొడిగా సాగింది. సర్కిల్‌ పరిధిలోని గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్‌, సూరారం డివిజన్లలోనూ ఇదే పరిస్థితి చోటుచేసుకున్నది.  

గాజులరామారం డివిజన్‌లో..

 56300 ఓట్లు ఉండగా మహిళలు 26,966, పురుషుల ఓట్లు 29324 ఉన్నాయి. వీటిలో 9గంటల వరకు 1.42 శాతం కాగా 11 గంటలకు వరకు 20.24 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.2 శాతం, 3గంటల వరకు 41.09 శాతం, సాయంత్రం 5గంటలకు 53.27 శాతం కాగా ఎన్నికలు ముగిసే సమయానికి 58.61శాతం నమోదైంది.

జగద్గిరిగుట్ట డివిజన్‌లో..

 45,785 ఓట్లు ఉండగా మహిళలు 21640, పురుషుల ఓట్లు 24144 ఉన్నాయి. వీటిలో 9గంటల వరకు 1.3 శాతం కాగా 11 గంటలకు వరకు 12.47 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 24.32 శాతం, 3గంటల వరకు 34.06 శాతం, సాయంత్రం 5గంటలకు 37.53 శాతం  కాగా ఎన్నికలు ముగిసే సమయానికి 52.91శాతం నమోదైంది.

చింతల్‌ డివిజన్‌లో..

 34874 ఓట్లు ఉండగా మహిళలు 16504, పురుషుల ఓట్లు 18368 ఉన్నాయి. వీటిలో 9గంటల వరకు 1.65 శాతం కాగా 11 గంటల వరకు 6.34 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 22 శాతం, 3గంటల వరకు 38.5 శాతం, సాయంత్రం 5గంటలకు 43.66 శాతం కాగా ఎన్నికలు ముగిసే సమయానికి 52.07 శాతం నమోదైంది.

సూరారం డివిజన్‌లో

 53,303 ఓట్లు ఉండగా మహిళలు 225269, పురుషుల ఓట్లు 28024 ఉన్నాయి. వీటిలో 9గంటల వరకు 1.67 శాతం కాగా 11 గంటల వరకు 15.13 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 21.42 శాతం, 3గంటల వరకు 32.5 శాతం, సాయంత్రం 5గంటలకు 32.62 శాతం కాగా ఎన్నికలు ముగిసే సమయానికి 50.08శాతం నమోదైంది. కాగా మొత్తం సర్కిల్‌ పరిధిలో 53.65 శాతం ఓటింగ్‌ నమోదైంది.

కత్బుల్లాపూర్‌ సర్కిల్‌లో.. 

జీడిమెట్ల : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో రంగారెడ్డినగర్‌, సుభాష్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల డివిజన్లలో మంగళవారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పొలింగ్‌ మధ్యాహ్నం తరువాత పొలింగ్‌ ప్రక్రియ పుంజుకుంది. ప్రశాంతంగా గ్రేటర్‌ ఎన్నికలు ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. వరుసగా సెలవులు రావడంతో ఓట్లు వేసేందుకు నిరాశసక్తతను ప్రదర్శించారు. దీంతో కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో 49.54 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదు అయింది. logo