గురువారం 21 జనవరి 2021
Medchal - Dec 01, 2020 , 07:52:57

కీసర గుట్టలో మంత్రి ప్రత్యేక పూజలు

కీసర గుట్టలో మంత్రి  ప్రత్యేక పూజలు

కీసర : సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసర గుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కార్తికపౌర్ణమి పురస్కరించుకొని భక్తులు పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే గర్భగుడిలో ప్రత్యేక అభిషేకాలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కీసర గుట్టకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావటంతో సందడి నెలకొన్నది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్‌ తటాకం శ్రీనివాస్‌ శర్మ, వేదపండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి గర్భగుడిలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


logo