శనివారం 23 జనవరి 2021
Medchal - Nov 30, 2020 , 07:48:20

టీఆర్‌ఎస్‌కే మా మద్దతు

టీఆర్‌ఎస్‌కే మా మద్దతు

దుండిగల్‌ :  గాజులరామారం సర్కిల్‌, సూరారం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మంత్రి సత్యనారాయణకు స్థానిక మున్నూరుకాపు సంఘం, మేరు సంఘాలు మద్దతు తెలిపాయి. ఆదివారం మార్కేండేయనగర్‌లోని ఫ్యారడైజ్‌ ఫంక్షన్‌హాల్‌లో అభ్యర్థి మంత్రి సత్యనారాయణ సమక్షంలో జరిగిన సమావేశానికి పార్టీ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శంభీపూర్‌రాజు ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సంద ర్భంగా కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని మున్నూరుకాపు సం ఘం ప్రతినిధులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు.  అదేవిధంగా మేరు సంఘం ప్రతినిధులు సైతం అభ్యర్థి మంత్రి సత్యనారాయణకు మద్దతు తెలి పారు. 

అంతకుముందు  ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు మాట్లాడుతూ .. ఎన్నికలప్పుడు మా త్రమే ప్రజల్లోకి వచ్చే నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు అభివృద్ధికి, ఆరాచకానికి మధ్య జరుగుతున్నాయని, నగరాభివృద్ధికి విశిష్ట కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని  కోరారు. మద్దతు తెలిపిన మున్నూరుకాపు, మేరుసంఘాల ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం, జగద్గిరిగుట్ట టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు రావుల శేషగిరిరావు, జగన్‌, దుండిగల్‌ కౌ న్సిలర్లు శంభీపూర్‌ క్రిష్ణ, ఎల్లుగారి సత్యనారాయణ, మాజీ జడ్పీ వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్‌, సీనియర్‌ నాయకులు హన్మంతరావు, అమీర్‌ఖాన్‌, బంగ్ల వెంకటేశ్‌తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. logo