సోమవారం 18 జనవరి 2021
Medchal - Nov 28, 2020 , 06:55:06

అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్‌ ఘనతే: మంత్రి మల్లారెడ్డి

అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్‌ ఘనతే:  మంత్రి మల్లారెడ్డి

జీడిమెట్ల: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో నిలిచిన పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమేనని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రంగారెడ్డినగర్‌ డివిజన్‌ పరిధిలోని చెన్నారెడ్డినగర్‌, నెహ్రూనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీ విజయశేఖర్‌గౌడ్‌ మద్దతుగా ప్రచారం చేశారు.  డివిజన్‌లో కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. తిరిగి ఎన్నికల్లో గెలిపిస్తే మిగిలిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డివిజన్‌లోఎమ్మెల్యే  కేపీ వివేకానంద పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.