Medchal
- Nov 27, 2020 , 05:52:54
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

కీసర : అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలోని వైకుంఠధామం, డంపింగ్‌యార్డులను , అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత స్థానిక సర్పంచ్ల పై ఉందన్నారు. ప్రభుత్వ హయాంలో చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని ఈ విషయంలో అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో ఏ పనులు పెండింగ్‌లో ఉన్నా సర్పంచ్‌లు, అధికారులే బాధ్యత వహించాలన్నారు. హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోర విమలనాగరాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఖమ్మంలో భారీగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత
- 60 ట్రాక్టర్ల ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు
- ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు బెదిరింపులు
- ఆవిష్కరణల హైదరాబాద్.. సౌరవిద్యుత్‌లో బాగుబాగు
- రన్ వే పై చిరుత రయ్.. రయ్...! వీడియో వైరల్... !
- విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- మరో 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో..ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
MOST READ
TRENDING