శనివారం 23 జనవరి 2021
Medchal - Nov 26, 2020 , 04:14:43

కుల వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది

కుల వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది

వినాయక్‌నగర్‌ : రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. వినాయక్‌నగర్‌ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ.. కుల వృత్తులపై ఆదారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. నాయీ బ్రాహ్మణుల షాపులకు కరెంట్‌ బిల్లులు, దోబీ వృత్తులు చేసుకునే వారి షాపులకు వచ్చే కరెంట్‌ బిల్లులు ,నీటి బిల్లులు డిసెంబర్‌ నుంచి మాఫీ చేస్తున్నామన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బద్దం పుష్పలతారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, పార్టీ అభ్యర్థి బద్దం పుష్పలతారెడ్డి, పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి బద్దం పరశురాంరెడ్డి, ఫరీద్‌, కృష్ణమూర్తి, బాలకృష్ణగుప్తా, రాజు, తదితరులు పాల్గొన్నారు.logo