వీడిన హత్య మిస్టరీ

మేడ్చల్ : ఓ మహిళను దారుణంగా హత్య చేసిన హంతకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 16న గుర్తు తెలియని మహిళ మృతదేహన్ని పోలీసులు కనుగొన్న విషయం తెలిసిందే. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఆమె హత్యకు గురైనట్లు గుర్తించి, హంతకుడిని అరెస్టు చేశారు. ఈ విషయమై మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మజ వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా, చేగుంట మండలం, చిత్తోజిపల్లి గ్రామానికి చెందిన తళ్లమండ్ల లక్ష్మీ (30) భర్త చనిపోవడంతో కూలీ పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో ఆమె మేడ్చల్ చెక్‌పోస్టులోని బెడ్ కంపెనీలో పని చేస్తుండగా అదే కంపెనీలో పని చేస్తున్న మెదక్ జిల్లా, రామాయంపేట మండలం, గందారిపల్లి గ్రామానికి చెందిన ల్యాగల కుమార్ (33)తో పరిచయం ఏర్పడింది. కంపెనీలో పని మానేసిన లక్ష్మీ కొద్ది రోజులుగా రోజు వారి కూలి పని చేస్తుండేది. ఈ నెల 12వ తేదీన మేడ్చల్‌లోని బావార్చి హోటల్ సమీపంలో కూలీ పని చేస్తున్న ఆమెను కుమార్ వెంటబెట్టుకుని డబిల్పూర్లోని తన స్నేహితుడు నర్సింహ గదికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించి ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. రాత్రి 8.30 గంటల సమయంలో వీరిని స్నేహితుడు కుమార్ టీవీఎస్పై డబిల్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో వదిలివెళ్లాడు. అనంతరం వీరు నడుచుకుంటూ సమీపంలోని మహాలక్ష్మీ వెంచర్లోకి వెళ్లి మరోసారి ఆమెతో మద్యం తాగించాడు.
నిలబడలేని స్థితికి చేరుకున్న ఆమె కాళ్ల కడియాలు తీయడానికి అతను ప్రయత్నం చేయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె మెడకు స్కార్ప్‌తో ఉరి బిగించి హత్య చేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె ప్రాణాలు వదిలింది. అనంతరం అక్కడే ఉన్న సీతాఫలం చెట్టుకు ఆమె చీరతో చేతులు కాళ్లు కట్టేసి ఆమె కాళ్ల కడియాలు, సెల్‌ఫోన్, రూ. 540 నగదు తీసుకుని అతడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఈ నెల 16న ఆమె మృతదేహాన్ని గుర్తించిన మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నాలుగు బృందాలు రంగంలోని దిగి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులు 20 సీసీ కెమెరాలను పరిశీలించి చివరకు, సీసీ ఫుటేసి ఆధారంగా వివరాలు సేకరించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన మేడ్చల్ సీఐ ప్రవీణ్‌రెడ్డి, ఎస్ఐలను డీసీపీ అభినందించారు. ఎస్ఐ అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి
- భరోసాతో బడికి
- ఈ రాశులవారికి.. ఆకస్మిక ధనలాభం
- యువత సన్మార్గం వైపు అడుగులేయాలి
- భయం వద్దు.. బర్డ్‌ఫ్లూ లేదు
- సంతోష్ బాబు పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకం
- కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- వారానికి 4 రోజులే.. కరోనా టీకా
- సిటిజన్ కాప్స్
- ప్రయాణం ఏదైనా కార్డు ఒక్కటే..