అఖండ మెజార్టీ సాధిస్తాం

జీడిమెట్ల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అఖండ మెజార్టీ తో విజయం సాధిస్తారని సుభాష్‌నగర్ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత నెలకొన్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డివిజన్ పరిధి కృషి కాలనీలోని టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి గుడిమెట్ల హేమలత కార్యాలయంలో బుధవారం ఆయ న ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. గ్రేటర్‌లోనే అత్యధిక మురికి వాడలతో కూడిన సుభాష్‌నగర్ డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. దేశ నలుమూలలకు చెందిన ప్రజలకు ఉపాధికి కల్పిస్తున్న ఈ నగరంలో అఖండ మెజార్టీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు మతిస్థిమితం కోల్పో యి మాట్లాడుతున్నారని, సర్జికల్ స్ట్రైక్ ఎక్కడ నిర్వహించాలో కూడా ఆ పార్టీ అధ్యక్షుడికి తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏమిటో బల్దియా ఎన్నికల్లో ప్రజలే బీజేపీ నేతలకు చూపిస్తారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టాలని చూసినా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు.
దశాబ్దాల సమస్యలు పరిష్కరించాం
- సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని అనేక మురికి వాడ లు అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు సమస్యలతో సావాసం చేసేవారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మురికి వాడల అభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ సుమారు రూ.65కోట్లు తీసుకువచ్చి ప్రతి మురికివాడను అభివృద్ధి చేశారని హన్మంత్ షిండే తెలిపారు.
- చేసిందే చెబుతున్నాం
- సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని ప్రజలు తాగు నీటి కోసం నానా అవస్థలు పడేవారు. వారం పది రోజులు వేచిచూడాల్సి వచ్చేది. ప్రధానంగా ఉన్న నీటి సమస్యను పరిష్కరించాం. రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నాం. ఏ బస్తీకి ట్యాంకర్లు రావాల్సిన పని లేకుండా చేశాం.
- అనేక కాలనీలు దశాబ్దం క్రితం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. మురుగు నీరు, పందులు, దోమలతో ప్రజలు నానా అవస్థలు పడేవారు. ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రతి బస్తీకి డ్రైనేజీ లైన్ వేయించడంతో పాటు సీసీ రోడ్లు నిర్మించి మురుగు నీరు రోడ్లపై నిల్వకుండా చేశాం.
- సుభాష్‌నగర్‌లో వర్షపు నీటి నాలా ప్రమాదకరంగా ఉండేది. కాలనీ మధ్యలో నుంచి ఉన్న నాలాను కాలనీని రెండు భాగాలు విభజించింది. ప్రమాదకరంగా ఉన్న వర్షపు నీటి నాలాను కోట్లాది రూపాయలు వెచ్చించి విస్తరించడంతో పాటు పునరుద్ధరించాం. కాలనీని వేరు చేస్తున్న నాలాను కలిపేశాం.
- రోడ్లను విస్తరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఐదేండ్లలో వందల కొద్ది అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన పాలన అందజేస్తున్నామని హన్మంత్ షిండే పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు సెగ తప్పదు
ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు మత విమర్శలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేసేందుకే మొహం చాటేస్తున్నారన్నారు. బీజేపీ అభ్యర్థులకు సర్జికల్ స్ట్రైక్ సెగ తప్పదన్నారు. ఇలాం టి అహంకార మాటలతో రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలను ఓటుతో బొందపెడుతారని సూచించారు.
తాజావార్తలు
- సంతోష్ బాబు పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకం
- కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- వారానికి 4 రోజులే.. కరోనా టీకా
- సిటిజన్ కాప్స్
- ప్రయాణం ఏదైనా కార్డు ఒక్కటే..
- వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి
- మహేశ్వరం మండలానికి నాలుగులేన్ల రోడ్డు
- బాధిత కుటుంబాలకు భరోసా..
- సీబీఎస్‌లో సౌకర్యవంతంగా...
- దోమలపై ఎంటమాలజీ యుద్ధం