మంగళవారం 26 జనవరి 2021
Medchal - Nov 26, 2020 , 04:04:57

గులాబీ జెండా ఎగురవేస్తాం

గులాబీ జెండా ఎగురవేస్తాం

జీడిమెట్ల : కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని ఎనిమిది డివిజన్లలో మరోమారు గులాబీ జెండా ఎగురవేస్తామని కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి అన్నారు. రంగారెడ్డినగర్‌ డివిజన్‌ పరిధి రంగారెడ్డినగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.విజయశేఖర్‌గౌడ్‌కు మద్దతుగా నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి ఆయనతో పాటు కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జంట సర్కిళ్ల పరిధిలోని ఎనిమిది డివిజన్లలో వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నాడు పవర్‌ హాలిడేలతో మూత పడుతున్న పరిశ్రమలకు 24 గంటల పాటు కరెంటు ఇచ్చి కార్మికుల జీవితాల్లో వెలుగు నింపా మని తెలిపారు.  మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజలు డిసెంబర్‌ నుంచి నీటి బిల్లులు చెల్లించవలసిన అవసరం లేదని అన్నారు.

 కార్మికుల కష్టాలు తెలిసిన సీఎం మోటరు వాహన దారులకు ఆర్నెళ్ల పన్ను మినహాయింపు ఇచ్చి వారికి అండగా నిలుస్తున్నారని, సెలూన్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు ఉచితంగా వచ్చే నెల నుంచి కరెంటు సరఫరా చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు మాట్లాడుతూ బల్దియా ఎన్నికల్లో ప్రజలను విడగొట్టాలని చూస్తున్న బీజేపీకి ఓటుతో వాత పెట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారానికి వస్తే.. నాడు అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారో.. చెప్పాలని నిలదీయాలని అన్నారు. ఎన్నికల అనంతరం వరద బాధి తులందరికీ వరద సాయం అందజేస్తామని తెలిపారు. విజయశేఖర్‌గౌడ్‌ను అఖండ మెజార్టీతో గెలిపిం చాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు కార్యకర్తల్లో జోష్‌ నింపాయి. ఈ కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

ఝూటా పార్టీ బీజేపీ: మంత్రి వేముల

కుత్బుల్లాపూర్‌: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని కల్లోల నగరంగా మార్చేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కుత్బుల్లాపూర్‌ 131 డివిజన్‌ పరిధిలోని రామక్రిష్ణనగర్‌ చౌరాస్తలో జరిగిన ధూంధాం కార్యక్రమానికి లఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఝూటా పార్టీ బీజేపి అని మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, వారి మాటలు పట్టించుకుంటే నగరాన్ని అల్లర్ల నగరంగా మార్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ నుండి బరీలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూన పారిజాతంను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎన్నికల ఇంచార్జీ, నిజామాబాద్‌ డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్‌రెడ్డి, పార్టీ శ్రేణులు గౌరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo