సోమవారం 18 జనవరి 2021
Medchal - Nov 25, 2020 , 08:50:36

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

మల్కాజిగిరి: నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో పోటీచేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తిచేశారు. మల్కాజిగిరి సర్కిల్‌లోని టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులతో మంత్రి ఈటల మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు, స్థానిక నేతలకు ఉద్బోధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రచారంలో ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు గుండ నిరంజన్‌, మోహన్‌రెడ్డి, గంగాధర్‌కృష్ణ,  ఖలీల్‌, రాజుయాదవ్‌, ప్రసాద్‌యాదవ్‌ పాల్గొన్నారు.