శనివారం 16 జనవరి 2021
Medchal - Nov 25, 2020 , 04:27:39

నగర అభివృద్ధి..టీఆర్‌ఎస్‌కే సాధ్యం

 నగర అభివృద్ధి..టీఆర్‌ఎస్‌కే సాధ్యం

కుత్బుల్లాపూర్‌ : హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధి టీఆర్‌ఎస్‌ పార్టీకే సాధ్యమని మాజీ మంత్రి తుమ్మల నా గేశ్వర్‌రావు, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి కూన పారిజాతం గెలుపు కోరుతూ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభు త్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు యావత్‌ దేశా నికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. వేల కోట్ల వ్యయం తో ప్రజాభివృద్ధే లక్ష్యంగా ఎనలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ...హైదరాబాద్‌ లాంటి మహానగరాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు బాటలు వేస్తున్నారన్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్‌ పాలనలో యావత్‌ దేశాలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. 

రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను అందించేందుకు తగు చర్యలు జరుగుతున్నా యన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపె డుతున్న సంక్షేమ పథకాలు.. బీజేపీపాలిత రాష్ర్టాల్లో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని వారు ప్రశ్నించారు. ఇక్కడి సంక్షేమ పథకాలు యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నా యని, ఫలితంగా బీజేపీకి ఇక్కడ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్‌ మహానగర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల అండదండలు ఉన్నాయని, పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని.. గ్రేటర్‌లో గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమ ని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి బండి రమేశ్‌తో పాటు కుత్బుల్లాపూర్‌ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.