ఇంటింటికీ సంక్షేమ పథకాలు

- టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఆసక్తి
- ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం
- స్వరాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట
- రూ.వేల కోట్లతో కాలనీల అభివృద్ధి
- బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆదోగతే
- ‘నమస్తే’తో చింతల్ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
“సమైక్య పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నిధులు, నియామకాలు, ఉద్యోగాలు లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్త్నురు. గడిచిన ఆరున్నరేండ్లలో ఎన్నో పథకాలను అమలు చేసిన టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఏనాడు అభివృద్ధి గురించి మాట్లాడని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇప్పుడు ఎన్నికల రాగానే జిత్తులమారి నక్కవలే వేషాలు వేస్తున్నారు. వారి జిమ్మిక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు”.. అని కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హయాంలో కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఎనలేని అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ప్రధానంగా డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ పథకం రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, పింఛన్లు, సీఎం సహాయనిధితోపాటు అనేక సంక్షే మ పథకాలతో ప్రజలకు చేరువైనట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏజెండాగా టీఆర్ఎస్ అభ్యర్థులు గత పాలనలో ముందుండి పని చేశారని, ఇంకా ఎన్నో అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
మ్యానిఫెస్టోతో హర్షాతీరేకాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రజలకు ఎంతో లాభదాయకంగా మారనుందన్నారు. ప్రధానంగా 20వేల లీటర్లకు తక్కువ నీటిని వినియోగించిన వారికి ఉచిత నీటి సరఫరా, లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, క్షౌరశాలలకు ఉచితంగా డిసెంబర్ నెల నుంచి కరెంట్‌ను సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో వృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలతో నగరాన్ని మరింత సుందరీకరణ చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, విదేశీ పెట్టుబడిదారులు నగరం వైపునకు ఆకర్శించేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని, తద్వారా పరిశ్రమలు ఏర్పాటుతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు
ప్రతిపక్షాలు నగరంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తూ జిత్తులమారి వేషాలు వేస్తున్నాయన్నారు. ఏనాడు ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రతిపక్ష నాయకులు ప్రస్తుతం ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారని ప్రశ్నించారు. వరదలతో వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి నెలకొందని, వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా రూ.550 కోట్లు అందించేందుకు తగి న చర్యలు తీసుకుంటే దానిని అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజే పీ, ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వరద బాధితులకు ఏం ఒరగబెట్టారో, ఇక్కడ ఏం అభివృద్ధి పనులు చేస్తారో తెలుపాలని డిమాండ్ చేశారు.
అడుగడుగునా టీఆర్ఎస్కే ఆదరణ
ప్రతి బస్తీలో కమిటీలు, వెల్ఫేర్ కమిటీలను సమన్వయం చేసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నామని ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. చింతల్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి రషీదాబేగానికి ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తున్నదని చెప్పారు. గడపగడపకూ తిరుగుతూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నా మని వివరించారు. గడిచిన ఐదేండ్లలో ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేసిన రషీదాబేగానికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నదన్నారు. టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడితే రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని చేసేందుకు ఆస్కారం ఉం టుందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
- కార్లు.. బారులు
- బుద్ధవనాన్ని సందర్శించిన సమాచార కమిషనర్
- కూలీల ట్రాక్టర్ బోల్తా
- నాలుగు లిఫ్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
- క్రీడలతో మానసిక ప్రశాంతత
- అంబరంలో విన్యాసాలు అదుర్స్
- థాయ్‌లాండ్ విజేత మారిన్
- తలైవాకు షాక్: డీఎంకేలోకి రజనీ మాండ్రం నేతలు
- ‘పేదింటి’ స్వప్నం సాకారం
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం