ఆదివారం 17 జనవరి 2021
Medchal - Nov 25, 2020 , 04:21:02

అభివృద్ధి చేశాం.. ఓటు అడిగే హక్కు మాకే ఉంది..

అభివృద్ధి చేశాం.. ఓటు అడిగే హక్కు మాకే ఉంది..

జీడిమెట్ల: “మాది దిల్‌దార్‌ సర్కార్‌.. గత ఆరున్న రేండ్లలో అభివృద్ధి చేశాం.. ఓటు అడిగే హక్కు మాకే ఉం టుంది.. కాంగ్రెస్‌, కమలం నేతలు ఎన్ని కల్లబొల్లి మాట లు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. గడపగడప కూ ప్రభుత్వ పథకాలు అందాయి.. గడిచిన ఆరున్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెం డా ఎగురవేస్తాం. బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంటాం.. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో సబ్బండవర్గాలకు అనుకూలంగా ఉంది.. ఉద్యమ సమయంలో ప్రజా  సమస్యలను దగ్గరుండి చూసిన సీఎం కేసీఆర్‌ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. బల్దియా పీఠాన్ని మరోమారు కైసవం చేసుకుని హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దు తాం”. అని రంగారెడ్డినగర్‌ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ చం ద్రానగర్‌లోని రంగారెడ్డినగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.విజయశేఖర్‌గౌడ్‌ కార్యాలయంలో ‘నమస్తే తెలంగాణ’ తో ముచ్చటించారు. ఆయన మాటల్లోనే..

అల్లర్లు సృష్టించేందుకు యత్నం

ఎన్నికల సమయంలో మాత్రమే కాలనీలకు వచ్చే ప్రతిపక్ష పార్టీల నేతలతో జాగ్రత్తగా ఉండాలని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, రైల్వేను సైతం ప్రైవేటుపరం చేసి దేశ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేసిందని ఆరోపించారు. ఇక్కడి కాషాయం నేతలు అత్యంత ప్రమాదకరమని సమయం దొరికినప్పుడల్లా హిందూముస్లిం అంటూ ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న నగరంలో అల్లర్లు సృష్టించే యత్ని స్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి ఓటేస్తే రంగారెడ్డి నగర్‌ డివిజన్‌కు ఆనుకుని వందల ఎకరాల్లో ఉన్న ఐడీపీఎల్‌, హెచ్‌ఎంటీ, ఐడీఎల్‌ స్థలాలను సైతం ప్రైవేట్‌కు అప్పగిస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు ప్రచారానికి వస్తే గతంలో పదేండ్లు అధికారంలో ఉండి ఏం చేశారో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

కేసీఆర్‌ మనసున్న ముఖ్యమంత్రి అని కొనియాడారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదని నిత్యం పరితపిస్తుంటారు. కరోనా కాలంలో సైతం పేదలకు పెద్దన్నలా అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌.. వరదల సమయంలో నిత్యం ప్రమాదస్థాయిని తెలుసుకుం టూ.. ప్రజలకు సూచనలు ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ వరదల్లోనే తిరుగుతూ బాధితులను పలుకరించి మీకు మేమున్నామంటూ మనోధైర్యం నింపారు. వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తక్షణ సాయం కింద రూ.550 కోట్లు మంజూరు చేశారు. ఇంటింటికీ నగదు చేరవేసి ప్రజల మన్ననలు పొందారు. వరద బాధితులకు ఇంత తొందరగా.. ఒకేసారి పదివేల రూపాయలు ఇచ్చిన ప్రభు త్వం ఎక్కడ లేదని, ఇదే దేశ చరిత్రలో మొదటిదన్నారు. దీనిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి వరద సాయాన్ని నిలిపివేయించారని ఆరో పించారు. ఇప్పుడు ఆపినంత మాత్రాన సాయం ఆగదని ఎన్నికల అనంతరం తప్పకుండా బాధితులకు అందిస్తామ న్నారు. వరద సాయం ఆపించిన కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు ఓటుతో గుణపాఠం చెప్పి.. డిపాజిట్‌ దక్కకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

వరదలు వస్తే.. ఇంట్లో దాక్కున్నారు..!

వరదలు వచ్చి మహానగరం కొట్టుకుపోతుంటే.. బాధితులకు అండగా నిలిచి.. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన విపత్కర సమయంలో కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇండ్లలో దాచుకున్నారని విమర్శించారు. ఆపత్కాలంలో అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌ పేదలకు సాయం అందజేస్తుంటే అడ్డుకున్నారని ఆరోపించారు. నగరమంతా వరదలతో అతలాకుతలం అయితే.. కేంద్రం ఒక్క పైసా కూడా సాయం చేయలేదని మండిపడ్డారు. ఇన్నాళ్లు బీజేపీ ఎంపీలకు సాయం అనే విషయం తెలియదని.. ఇప్పుడు ఎన్నికలు రాగానే రూ.25 వేలు ఇస్తామని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరి ఇన్నిరోజులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. నగరాన్ని వేల కోట్లతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే.. మత కల్లోలాలు సృష్టించి హిందూముస్లింల మధ్యన గొడవలు పెట్టే ప్రయ త్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి ఓటువేస్తే హైదరాబాద్‌ను రెండుగా చీల్చుతారని.. అలాంటి పార్టీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. 

అత్యధిక మెజార్టీ తెస్తాం

రంగారెడ్డినగర్‌లో ప్రతిపక్షాలకు డిపాజిట్‌ కూడా రాదని, అందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మచ్చలేని మనిషిగా ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్య్థ విజయశేఖర్‌గౌడ్‌కు డివిజన్‌వాసులు స్వచ్ఛందంగా మద్ద తు తెలుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ప్రతిపక్షాలకు ఓటేస్తే జరిగే నష్టాన్ని తెలుపుతూ ప్రచారంలో ముందుకుసాగుతున్నామని తెలి పా రు. రంగారెడ్డినగర్‌ డివిజన్‌ అభ్యర్థి విజయ శేఖర్‌గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు ప్రతిపక్షాలు ఏ మాత్రం పోటీలో నిలువలేవని స్పష్టం చేశారు. 

రంగారెడ్డినగర్‌కు ఎంతో చేశాం

  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు..రాష్ట్రం ఏర్పాటు తర్వాత రంగారెడ్డినగర్‌ డివిజన్‌లో చోటుచేసుకున్న మార్పులను డివిజన్‌ ప్రజలు గుర్తించాలన్నారు.
  • ప్రతీ కాలనీలో డ్రైనేజీలను విస్తరించడంతో పాటు సీసీ రోడ్లు నిర్మించాం. 
  • గత ఐదేండ్ల క్రితం నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారానికోసారి వచ్చే నీటి కోసం ట్యాంకర్ల వద్ద మహిళలు కొట్లాటలు జరిగేవి. ఇప్పుడు అలాంటి సంఘటనలు ఎక్కడ కనిపించడం లేదు. ఒక్క మహిళ కూడా బిందె పట్టుకొని రోడ్డెక్కడం లేదు. ఖర్చుకు వెనుకడుగు వేయకుండా సీఎం కేసీఆర్‌ వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకువచ్చి ప్రతి ఒక్కరి గొంతు తడుపున్నారు. రోజు రోజు కావాల్సినన్ని నీళ్లు సరఫరా చేస్తూ దాహం తీర్చుతున్నాం.  
  • ఐడీపీఎల్‌ నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా ఉండేది. వారానికో రోడ్డు ప్రమాదం జరిగి అనేక మంది మృత్యువాత పడ్డారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఐడీపీఎల్‌ నుంచి రంగారెడ్డినగర్‌ వరకు రోడ్డును విస్తరించాం, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలు నివారించాం. 
  • డివిజన్‌ వాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు రంగారెడ్డినగర్‌, నందానగర్‌లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. ఇలా అనేక సమస్యలు పరిష్కరించాం.. మంత్రిగా చెబుతున్నా.. విజయశేఖర్‌ గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి.. డివిజన్‌ను ఆదర్శ వంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.