ఆదివారం 17 జనవరి 2021
Medchal - Nov 25, 2020 , 04:17:51

గ్రేటర్‌లో ఎగిరేది టీఆర్‌ఎస్‌ జెండానే

గ్రేటర్‌లో ఎగిరేది టీఆర్‌ఎస్‌ జెండానే

దుండిగల్‌ : సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వేలాది మంది వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సూరారం డివిజన్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌రాజు(జిమ్‌ వేణు) తన అను చరులతో కలిసి మంగళవారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్‌,  జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ..  గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా రన్నారు.  కార్యక్రమంలో పార్టీ  అభ్యర్థి మంత్రి సత్యనారా యణతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతుందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. మంగళవారం డీసీసీ మేడ్చల్‌ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్‌ ముఖ్య అనుచరు లు పందిరి యాదగిరి, పుల్లారావు, నారాయణ, రాధాక్రిష్ణ, నరేశ్‌లు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. మంగళవారం చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే  పార్టీ కండువాలు కప్పి  ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌కు వలసలు కొనసాగుతున్నాయన్నారు.  కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ గుడిమెట్ల సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.