అడుగడుగునా.. బ్రహ్మరథం

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు సోమవారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా అభ్యర్థులకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కుత్బుల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూన పారిజాత, జీడిమెట్ల డివిజన్లో అభ్యర్థి కూన పద్మలు ఆయా డివిజన్ల పరిధిలో ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకా నంద్‌తో పాటు ఆయా డివిజన్ల ఎన్నికల ఇన్చార్జీలు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ప్రచారం నిర్వహిహంచారు. ఈ సందర్భంగా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సూచిం చారు. అలాగే ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు, కుల సం ఘాలు, ప్రైయివేట్ టీచర్స్ అసోషియేషన్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపును కోరుతూ సంపూర్ణ మద్దతు తెలిపారు.
జీడిమెట్ల డివిజన్లో..
డివిజన్లోని గణేశ్ హౌసింగ్ కాలనీ, విమానపురి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, పేట్ బషీరాబాద్ ఓల్డ్ శివాలయం కాలనీతోపాటు పలు కాలనీల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూన పద్మ విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. అలాగే పాటిగడ్డ, హరిజన బస్తీ, గార్డెన్ బస్తీ, వీరస్వామినగర్, బీరప్పనగర్, మంజీరా అపార్ట్మెంట్, అయోధ్యనగర్, వినాయక్నగర్లలో అభ్యర్థి కూన పద్మకు ప్రజలు మంగళహారతులతో స్వాగతం తెలిపి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ ప్రచారంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత కేఎం ప్రతాప్, యువ నాయకులు కేపీ విశాల్గౌడ్తో పాటు పార్టీ కార్యకర్తలు, ఆయా కాలనీల అసోషియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ డివిజన్లో...
డివిజన్ పరిధిలో పార్టీ అభ్యర్థి కూన పారిజాత విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షు లు, డివిజన్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి పోచారం భాస్కర్‌రెడ్డి నే తృత్వంలో అభ్యర్థి కూన పారిజాతతో కలిసి వాజ్‌పేయ్‌నగర్, దత్తాత్రేయనగర్తో పాటు ఆయా కాలనీల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారాన్ని చేపట్టారు. గడపగడపకు టీఆర్ఎస్ జెం డాను ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు కేఎం గౌరీశ్తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
టీఆర్ఈటీఏ సంపూర్ణ మద్దతు...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రిటైర్డు ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోషియేషన్స్ కుత్బుల్లాపూర్ శాఖ స్వచ్ఛందంగా తమ మద్దతును తెలిపింది. అన్నీరంగాల్లోని అభివృద్ధిని చాటుతున్న టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అసోషియేషన్ అధ్యక్షులు బాలచంద్రం, ప్రతినిధులు మల్లారెడ్డి, కృష్ణమూర్తి, బాలక్రిష్ణారెడ్డిలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రాధేశ్యామ్ యూనిట్‌కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
- పట్టు బిగిస్తున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి