గురువారం 28 జనవరి 2021
Medchal - Nov 24, 2020 , 09:03:43

అభ్యర్థుల గెలుపునకు ఏకగ్రీవ తీర్మానాలు

అభ్యర్థుల గెలుపునకు ఏకగ్రీవ తీర్మానాలు

కుత్బుల్లాపూర్‌ :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. నగరంలో కాలనీలను స్వచ్ఛందంగా తీర్చిదిద్దుకునేందుకు మొదటి ప్రాధాన్యతను కల్పించింది. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్‌-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో కాలనీల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ, సీసీరోడ్లు, మంచినీటి సదుపాయాలతో పాటు ప్రభుత్వం అందించిన కళ్యాణలక్ష్మి, షాదీముభారక్‌తో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువు చేశారు.  మంత్రి కేటీఆర్‌ సహకారంలో కుత్బుల్లాపూర్‌ జంట సర్కిళ్ల పరిధిలో కోట్ల రూపాయల అభివృద్ధి ప నులు జరిగాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పొందిన కాలనీవాసులంతా ముందుకు వస్తున్నారు. కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి కూన పారిజాత, జీడిమెట్ల డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి కూన పద్మల గెలుపు కోరుతూ ఆయా డివిజన్ల పరిధిలో కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ తీర్మాన పత్రాలను  ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కేఎం ప్రతాప్‌, అభ్యర్థులకు అందజేశారు.  


logo