శనివారం 28 నవంబర్ 2020
Medchal - Nov 22, 2020 , 04:27:17

టీఆర్‌ఎస్‌దే..గ్రేటర్‌ పీఠం

టీఆర్‌ఎస్‌దే..గ్రేటర్‌ పీఠం

కీసర : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటి గ్రేటర్‌పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు.  టీఆర్‌ఎస్‌ కీసర మండల నాయకులు శనివారం ఎమ్మెల్యేని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. కోట్లాది రూపాయలతో గతంలో ఎన్నడూ జరగని విధంగా హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్‌ శ్రేణులపై ఉందన్నారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి, మండల మాజీ కన్వీనర్‌ నాయకపు వెంకటేశ్‌ ముదిరాజ్‌,  కీసర మాజీ ఎంపీటీసీ మచ్చాని జంగయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నేతలు కందాడి ప్రభాకర్‌రెడ్డి, దీపు, చీర సురేశ్‌, సంగారం నారాయణ, చినింగని బాల్‌రాజ్‌, గోరంటి ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.