సీఎం సహాయనిధి పేదలకు సంజీవని

మేడ్చల్ రూరల్ : నిరుపేదల పాలిట సీఎం సహాయనిధి సంజీవనిలా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిధిలోని మైసిరెడ్డిపల్లికి చెందిన పద్మకు రూ.20వేలు, గౌడవెల్లికి చెందిన సతీశ్‌కుమార్‌కు రూ.60వేలు, రావల్‌కోల్‌కు చెందిన లక్ష్మీకి రూ.15వేలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను మంగళవారం ఆయన తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేద స్థితిలో ఉండి, వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సంక్షేమ ప్రభుత్వంలో లక్షలాది మంది సహాయనిధి ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన నాగలక్ష్మీకి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం మంత్రి మల్లారెడ్డి అందజేశారు. టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపనబోలు హరిగౌడ్, నాయకులు దుర్గం సాయినాథ్ గౌడ్, కిరణ్‌కుమార్ గుప్తా, మణికంఠ ముదిరాజ్, నాగాయిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
శామీర్‌పేట మండలానికి చెందిన ముగ్గురికి...
శామీర్‌పేట : మండల పరిధిలోని ముగ్గురికి సీఎం సహాయనిధి కింద ఆర్థిక సాయం మంజూరైంది. లాల్‌గడీ మలక్‌పేటకు చెందిన నాగమణికి రూ.లక్ష, ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణకు రూ.35వేలు, మజీద్‌పూర్‌కు చెందిన వరప్రసాద్‌కు రూ.60వేలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రి మల్లారెడ్డి తన కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనితాలాలయ్య, మజీద్‌పూర్ సర్పంచ్ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నర్సింగరావు, మురళీచారి, లాలయ్య, రాము, హరిబాబు పాల్గొన్నారు.
పోచారం మున్సిపాలిటీ పరిధిలో..
ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి గ్రామానికి చెందిన టి.ఈశ్వర్రావుకు రూ. 60 వేలు, అన్నోజిగూడకు చెందిన ఎన్.శాంతకు రూ. 31 వేలు, ఏ.వెంకటేశ్ రూ.37 వేలు చెక్కులను మంత్రి మల్లారెడ్డి, చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్,కౌన్సిలర్ మోటుపల్లి పోచమ్మ, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం. సురేందర్ రెడ్డి,నాయకుడు బి. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అందజేశారు.
తాజావార్తలు
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం