గురువారం 03 డిసెంబర్ 2020
Medchal - Nov 01, 2020 , 05:15:05

ఐక్యతకు కృషి చేసిన మహోన్నతుడు

 ఐక్యతకు కృషి చేసిన మహోన్నతుడు

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌  జయంతిని మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  హాజరై కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను చేయించారు. 

మేడ్చల్‌ జోన్‌ బృందం : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని శనివారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కార్యక్రమంలో పాల్గొని, జాతీయ ఐక్యత కోసం చేసిన కృషిని కొనియాడారు. పటేల్‌ ఆశయ సాధనకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో సరార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పటేల్‌కు నివాళులర్పించి, ఆయన సాధనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీఓ అరుణ, సూపరింటెండెంట్‌ పద్మలత, సిబ్బంది కుమార్‌, వెంకటాపూర్‌ కార్యదర్శి విష్ణువర్ధన్‌ పాల్గొన్నారు. కీసర మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు నల్ల వెంకట్‌రెడ్డి, చిక్కుడు సత్యనారాయణ, మిట్టపల్లి సాయిగౌడ్‌, మల్లేశ్‌, రాములు పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పటేల్‌ జయంతిని పురస్కరించుకొని,  ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు పాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సురేందర్‌ ముదిరాజ్‌, ఉప సర్పంచ్‌ పెంటమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  కాచవానిసింగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్దార్‌ వల్లభాయ్‌ చిత్రపటానికి సర్పంచ్‌ కొంతం వెంకట్‌రెడ్డి. ఉపసర్పంచ్‌ విష్ణుగౌడ్‌. వార్డు సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు.

మహర్షి జయంతి  

 మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.