శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medchal - Nov 01, 2020 , 05:08:42

సంక్షేమానికి ఆకర్షితులై.. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు

సంక్షేమానికి ఆకర్షితులై.. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు

మేడ్చల్‌ : సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు, యువజన సంఘం సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదల సంక్షేమానికి చేపట్టిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ఆరేండ్లలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా మారిందని చెప్పారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు గడ్డం బాబు, నర్సింహ, లయన్స్‌ యువజన సంఘం సభ్యులు ప్రదీప్‌ కుమార్‌, సంతోశ్‌, శివతో పాటు మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్లు దేవరాజ్‌, శ్రీనివాస్‌రెడ్డి, నాయకుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ

 శామీర్‌పేట : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జవహర్‌నగర్‌ మేయర్‌ మేకల కావ్య అన్నారు. శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును లబ్ధిదారులు వి.మణెమ్మకు మేయర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకు వారధిగా పనిచేయాలన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు మురుగేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు శోభారెడ్డి, చిట్టా శ్రీనివాస్‌రెడ్డి, కోటేశ్‌గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సింగన్న, మేకల అయ్యప్ప, బాలరాజు, సిద్ధులు పాల్గొన్నారు.

 దవాఖానకు 108 వాహనాన్ని కేటాయించాలి

 ఘట్‌కేసర్‌ రూరల్‌ : ఘట్‌కేసర్‌ పట్టణంలోని జిల్లా దవాఖానకు 108 వాహనాన్ని మంజూరు చేయాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి మంత్రి మల్లారెడ్డిని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఘట్‌కేసర్‌ ప్రభుత్వ దవాఖానగా మారినప్పటికీ సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అత్యవసర రోగుల సౌకర్యార్థం 108 అంబులెన్స్‌ వాహనాన్ని మంజూరు చేసి మండల ప్రజలను ఆదుకోవాలని కోరారు. మంత్రి మల్లారెడ్డిని కలిసిన వారిలో వెంకటాపూర్‌ ఎంపీటీసీ నీరుడి రామారావు, ఉప సర్పంచ్‌ సత్యనారాయణ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు హరిప్రసాద్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు.