సోమవారం 30 నవంబర్ 2020
Medchal - Oct 31, 2020 , 08:10:40

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు

కీసర : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని, తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని నర్సంపల్లిలో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. అలాగే తిమ్మాయిపల్లిలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీసర మండలంలోని అన్ని గ్రామాల్లో శాశ్వత పంచాయతీ భవనాలను నిర్మించామని, పెండింగ్‌లో ఉన్న నర్సంపల్లిలో కూడా చేపట్టామని తెలిపారు. అలాగే పనులు చేసే కాంట్రాక్టర్లు నాణ్యతతో చేపట్టాలన్నారు.  రైతాంగం కోసం సీఎం కేసీఆర్‌ రైతువేదిక భవనాలకు శ్రీకారం చుట్టారని, ఆ భవనాలు పూర్తి దశకు చేరుకున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులతో పాటు మంత్రుల కోటా కింద అత్యధిక నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, జడ్పీటీసీ బెస్త వెంకటేశ్‌, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ,  ఎంపీటీసీ ప్రమీలారెడ్డి, సర్పంచ్‌లు  సత్తమ్మ, పిడిచుట్టి పెంటయ్య,నాయకపు మాధురి వెంకటేశ్‌, తుంగ ధర్మేందర్‌, కౌకుట్ల గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ నారాయణశర్మ, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జె.సుధాకర్‌రెడ్డి,  నేతలు నాయకపు వెంకటేశ్‌ముదిరాజ్‌, కందాడి అమరేందర్‌రెడ్డి, ఎంపీడీవో పద్మావతి పాల్గొన్నారు. 

 పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన  మహోత్సవంలో..  

మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో సర్పంచ్‌ పిడిచుట్టి పెంటయ్య స్వచ్ఛందంగా రూ.30 లక్షలతో నిర్మించిన పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.  

 పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

 మేడ్చల్‌ కలెక్టరేట్‌ : పేదల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలోని 13వ వార్డు అంజనాద్రి నగర్‌కు చెందిన పి.మహేష్‌ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందాడు. అనంతరం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయనకు సీఎం సహాయనిధి నుంచి  మంజూరైన రూ.45 వేలు, 2వ వార్డుకు చెందిన టి.అబ్బులుకు రూ. 22,500ల చెక్కులను మంత్రి శుక్రవారం అందజేశారు.కార్యక్రమంలో మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కౌకుట్ల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపనబోలు హరిగౌడ్‌, కౌన్సిలర్లు వసుపతి రమేష్‌ గౌడ్‌, నాగాయిపల్లి సుజాత, నాయకులు నాగాయిపల్లి శ్రీనివాస్‌, తిరుపతి శెట్టి, పాల్గొన్నారు.