శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medchal - Oct 29, 2020 , 09:44:15

సీఎం కేసీఆర్‌ నిరుపేదల పక్షపాతి

సీఎం కేసీఆర్‌ నిరుపేదల పక్షపాతి

మేడ్చల్‌ కలెక్టరేట్‌: సీఎం కేసీఆర్‌ నిరుపేదల పక్షపాతి అని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అకాల వర్షాలకు వరదలతో ముంపుకు గురైన బాధితుల ఇంటింటికీ మంత్రి వెళ్లి సీఎం అందించిన రూ.10 వేలను పంపిణీ చేశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వరద ముంపునకు గురైన బాధితులను తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ముంపు బాధితులకు మొదటి విడత రూ.10 వేలు అందిస్తున్నామని, కూలిన ఇంటికి లక్ష రూపాయిలు,  దెబ్బతిన్న వాటికి రూ.50 వేలు అందిస్తామని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని, దెబ్బతిన్న రోడ్లు, మురికి కాలువలు మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని అన్నారు. అనంతరం మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు రూ.10 వేల పరిహారం అందించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 786 మంది బాధితులను గుర్తించారు. మొదటిరోజు ఇందిమ్మ కాలనీ, అంజనాద్రీ కాలనీల్లో 96 మంది బాధితులకు రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. 

అంబులెన్స్‌ ప్రారంభం

కో-ఆప్షన్‌ సభ్యుడు విడియాల రజిని వినయ్‌ గిఫ్ట్‌ ఏస్మైల్‌ కార్యక్రమంలో భాగంగా అందజేసిన అంబులెన్స్‌ను మున్సిపల్‌ కార్యాలయం వద్ద బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్‌ స్వామి, టీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు కౌకుట్ల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపనబోలు హరిగౌడ్‌, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

పోచారం మున్సిపాలిటీలో.. 

ఘట్‌కేసర్‌: ప్రజల కష్టకాలంలో వెంటనే స్పందించి సీఎం కేసీఆర్‌ రూ. 10 వేల వరద సహాయం అందజేసి ఆదుకుంటున్నాడని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. బుధవారం పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ ఇందిరానగర్‌ కాలనీ వాసులకు ప్రభుత్వ వరద సాయం రూ. 10 వేలను ఇక్కడి నాయకులు, అధికారులతో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వచ్చే ఎలాంటి కష్టాలైనా సీఎం స్పందిస్తున్నారని అన్నారు. దేశంలో ఇంత వేగంగా స్పందించి ప్రజలకు నగదు రూపంలో సహాయం అందజేసిన సీఎంలలో కేసీఆర్‌ ఒక్కరేనని మంత్రి మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎలాంటి విపత్తులు ఏర్పడినా, ప్రజల పక్షాన నిలబడి చేయూతనిస్తున్నారని వివరించారు. అభివృద్ధితోపాటు, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కూడ ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి వైపరిత్యాలైన అధిక వర్షాలు, కరోనా వంటి సమస్యలు ఏర్పడినా ప్రజలు కోల్పోకుండా ఎప్పటికప్పుడు ఆదుకుంటూ రాష్ర్టాన్ని ముందుకు తీసుకపోతున్నారని మంత్రి మల్లారెడ్డి వివరించారు. కమిషనర్‌ సురేశ్‌కుమార్‌, మేనేజర్‌ నర్సింహులు, చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రెడ్యానాయక్‌, కౌన్సిలర్లు హేమ, పోచమ్మ, బి. హరిప్రసాద్‌రావు, రవీందర్‌, సింగిరెడ్డి సాయిరెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ మందడి సురేందర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాలేశ్‌, నాయకులు బి. సత్తిరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, ఐలయ్య, బుచ్చిరెడ్డి కార్యకర్తలు, స్థానికులు పాల్గొనారు.