ప్రతి గింజ కొంటూ ఆదుకుంటున్నాం

ఘట్కేసర్ రూరల్: రైతును రాజును చేయటమే లక్ష్యంగా పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి మాదారం, ఎదులాబాద్, ప్రతాపసింగారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి పండించిన చోటే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నట్లు చెప్పారు. పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని, రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తూ అందులో భాగంగానే రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడులను అందించటంతోపాటు ఏ కాలంలో ఏ పంటలు వేసుకోవాలని, లాభదాయకమైన పంటల గురించి ఎప్పటికప్పుడు రైతులకు వివరించి చైతన్యపరిచేందుకు సీఎం కేసీఆర్ రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, మండల అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మాజి ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, జిలా వ్యవసాయాధికారి మేరి రేఖ, తహసీల్దార్ విజయ లక్ష్మి, సర్పంచ్లు యాదగిరి, సురేశ్, శివశంకర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కందుల కుమార్, నాయకులు రేసు లక్ష్మారెడ్డి, మూసి శంకర్, చందుపట్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు.
మాదారం గ్రామ రైతులకు తిప్పలు తప్పినయి
ధర యిచ్చి ఆదుకుంటుండు
తాజావార్తలు
- ఆ పరిస్థితి ఎవరికీ రావొద్దు!
- నేడు మంత్రి కేటీఆర్ పర్యటన
- రాంభీమ్ పోరుపథం
- 3.1 సెకన్లలో 96 కి.మీ స్పీడ్.. మార్చిలో భారత్లోకి టెస్లా మోడల్-3!
- ఆదిపురుష్ ప్రపంచంలోకి..
- వెండితెరకు కథలు రాద్దాం
- దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు
- ఆ మాటకు వాళ్లు అర్హులు కాదు!
- బాధితురాలికి ఎమ్మెల్యే షిండే పరామర్శ
- పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తిచేయాలి