శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medchal - Oct 28, 2020 , 08:24:33

ఉమామహేశ్వర కాలనీ వాసులకు అండగా ఉంటాం

ఉమామహేశ్వర కాలనీ వాసులకు అండగా ఉంటాం

కుత్బుల్లాపూర్‌,అక్టోబర్‌27: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని ఇటీవలె వరుసగా కురిసిన వర్షాలకు కొంపల్లి మున్సిపాలిటీ ఉమామహేశ్వర కాలనీ పూర్తిగా జలమయంగా మారింది. జీడిమెట్ల డివిజన్‌లో ఉన్న ఫాక్స్‌సాగర్‌ చెరువు నిండుకుండలా మారడంతో దానికి ఎగువప్రాంతంలో ఉన్న ఉమామహేశ్వరకాలనీ పూర్తిగా జలమయంగా మారడంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ఫాక్స్‌సాగర్‌ చెరువు తూం ద్వారా నీటిని విడుదల చేయడంతో కాలనీలో కొంతమేరకు ఉపశమనం లభించింది. గత పది రోజుల నుంచి కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో అక్కడి వరద బాధితులకు ప్రభుత్వం నుంచి అందిస్తున్న నగదును అందిస్తూ భరోసాను ఇస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో పాటు కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌తో పాటు పేట్‌ బషీరాబాద్‌ సీఐ రమేశ్‌లతో కలిసి సందర్శించారు. మరికొన్ని రోజుల్లోనే వరద ఉధృతి తగ్గి కాలనీలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అనునిత్యం కాలనీలో పర్యవేక్షించి సమస్యను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ, ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దని స్థానికులకు హామీ ఇచ్చారు.