గురువారం 03 డిసెంబర్ 2020
Medchal - Oct 27, 2020 , 09:29:04

ప్రతి కాలనీలో సీసీరోడ్డు

ప్రతి కాలనీలో సీసీరోడ్డు

మల్కాజిగిరి : ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నిధులను పుష్కలంగా మంజూరు చేస్తున్నది. మల్కాజిగిరి సర్కిల్‌లోని డివిజన్లలోని వివిధ కాలనీల్లో  సీసీరోడ్ల నిర్మాణాలకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇటీవల సమర్పించారు. దీంతో రూ. 40 కోట్ల నిధులను ప్రభుత్వం తక్షణం మంజూరు చేయడంతో  పనుల ప్రారంభానికి టెండర్ల పక్రియను అధికారులు ప్రారంభించారు. పక్రియ పూరైన వెంటనే పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సర్కిల్‌లోని నేరేడ్‌మెట్‌, వినాయక్‌నగర్‌, మౌలాలి, ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌, మల్కాజిగిరి, గౌతంనగర్‌ డివిజన్లలోని రోడ్లు లేని కాలనీలను అధికారులు గుర్తించారు. 111 కాలనీల్లో సీసీరోడ్ల నిర్మాణా పనులు జరగనున్నాయి. 

త్వరలోనే పనులను ప్రారంభింస్తాం

మల్కాజిగిరి సర్కిల్‌లోని ప్రతి కాలనీలో సీసీరోడ్ల నిర్మాణం చేపడుతాం.  ప్రభుత్వం రూ. 40 కోట్ల నిధులను మంజూరు చేసింది. రోడ్లు లేని కాలనీలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన వెంటనే నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులను ప్రారంభింస్తాం. సీసీరోడ్ల నిర్మాణాలతో పాటు ప్రతి కాలనీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీల నిర్మాణాలకు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తాం -మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే 

టెండర్ల పక్రియ పూర్తి చేశాం 

సీసీరోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరుతో టెండర్ల పక్రియను పూర్తి చేశాం. త్వరలోనే పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. 111 పనులకు టెండర్ల ఆహ్వానించాం. అగ్రిమెంట్‌ త్వరితగతిన పూర్తి చేసి, ఎమ్మెల్యే హన్మంతరావు ఆదేశాల మేరకు రోడ్లులేని కాలనీలను గుర్తించి  రోడ్లను నిర్మి స్తాం. ఇటీవల కురిసిన వర్షాలకు చెడిపోయిన రోడ్లకు మరమ్మతులు చేపడుతాం. - అనిల్‌రాజ్‌, సికింద్రాబాద్‌ జోనల్‌ ఈఎస్‌ఈ