గురువారం 03 డిసెంబర్ 2020
Medchal - Oct 27, 2020 , 09:22:00

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

మేడ్చల్‌ : చెరువులో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్‌ పెద్ద చెరువులో గుర్తు తెలియని వ్యక్తి( 40) మృతదేహం తేలియాడుతుండగా.. సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. స్థానికంగా ఆరా తీసినా అతడి ఆచూకీ లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.