మంగళవారం 01 డిసెంబర్ 2020
Medchal - Oct 25, 2020 , 12:55:42

పార్కుల అభివృద్ధికి కృషి చేస్తాం

పార్కుల అభివృద్ధికి కృషి చేస్తాం

మేడ్చల్‌ రూరల్‌ : మండల పరిధిలోని డబిల్‌పూర్‌ గ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జమ్మిపార్కును మంత్రి చామకూర మల్లారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ గీతాభాగ్యారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామానికి ఉన్న ప్రభుత్వ స్థలం 1500 గజాల్లో జమ్మి పార్కు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండుగ దసరా అన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పార్కులోని జమ్మి వృక్షాన్ని సందర్శించుకుని, ఆనందంగా పండుగ జరుపుకోవ్చని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు విధిగా పాటించి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని సర్పంచ్‌ను ప్రత్యేకంగా మంత్రి అభినందించారు.  కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజారెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు గౌస్‌పాష, ఎంపీటీసీ హేమలత, ఉప సర్పంచ్‌ సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ రాజమల్లారెడ్డి, నాయకులు భాగ్యారెడ్డి, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సద్ది సురేశ్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.