గురువారం 03 డిసెంబర్ 2020
Medchal - Oct 24, 2020 , 06:41:59

వరద బాధితులకు చేయూత

వరద బాధితులకు చేయూత

జీడిమెట్ల : భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ సుభాష్‌నగర్‌ డివిజన్‌ పరిధి గంపలబస్తీ, రంగారెడ్డినగర్‌ డివిజన్‌ పరిధి గిరినగర్‌, చింతల్‌ డివిజన్‌ పరిధి భగత్‌సింగ్‌నగర్‌లో ఎమ్మెల్యే పర్యటించి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని వరద బాధితులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులకు ఆర్థిక సహాయంతో పాటు వరదల కారణంగా దెబ్బతిన రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి ప్రభుత్వం రూ.550 కోట్లు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు దేవగారి రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మన్నెరాజు, రంగారావు, గర్దాస్‌ రాజశేఖర్‌, పద్మజారెడ్డి, అడపశేషు, అడపశేఖర్‌, ఇస్మాయిల్‌, కె.శ్రీనివాస్‌, రంగారెడ్డినగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ బి.విజయ్‌శేఖర్‌గౌడ్‌, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మహమ్మద్ఫ్రీ, నాయకులు జయరాం,టి.లక్ష్మారెడ్డి, అబ్దుల్‌ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు. చింతల్‌ డివిజన్‌ పరిధి చంద్రానగర్‌లో వరద బాధిత కుటుంబాలకు శుక్రవారం రూ.10 వేల నగదును కార్పొరేటర్‌ రశీదా మహమ్మద్‌ రఫీ అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ చింతల్‌ డివిజన్‌ అధ్యక్షుడు మహమ్మద్ఫ్రీతో పాటు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డినగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ బి.విజయ్‌శేఖర్‌గౌడ్‌ శుక్రవారం డివిజన్‌ పరిధిలోని నందానగర్‌, మారుతినగర్‌, విజయ్‌నగర్‌కాలనీ, గిరినగర్‌, పంచశీలకాలనీ, గురుమూర్తినగర్‌లల్లో వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు అందజేశారు. బాధితులు అధైర్యపడొద్దని సూచించారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు పెండ్లి భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కార్తీక్‌గౌడ్‌, అభిరామ్‌, సాధిక్‌, బాబా తదితరులు పాల్గొన్నారు. 

కుత్బుల్లాపూర్‌లో..

జీడిమెట్ల డివిజన్‌ పరిధిలోని ప్రశాంతినగర్‌లో వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రూ.10 వేల నగదును కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌, యువ నాయకులు కేపి విశాల్‌గౌడ్‌లు శుక్రవారం పంపిణీ చేశారు.కుత్బుల్లాపూర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కెఎం గౌరీశ్‌  శుక్రవారం వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం రూ.10వేలను అందజేశారు.కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు దేవరకొండ శ్రీనివాస్‌, సంపత్‌ మాధవరెడ్డి, కిశోర్‌చారి, సత్తిరెడ్డి  పాల్గొన్నారు.

దుండిగల్‌ లో..

దుండిగల్‌ : భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రతి బాధిత కుటుంబాన్ని  ప్రభుత్వం ఆదుకుంటుందని సూరారం డివిజన్‌ కార్పొరేటర్‌ మంత్రి సత్యనారాయణ అన్నారు. గాజులరామారం సర్కిల్‌, సూరారం డివిజన్‌ పరిధిలోని కళావతినగర్‌, సోనియాగాంధీనగర్‌, విశ్వకర్మకాలనీ, శ్రీకృష్ణానగర్‌లలోని వరద బాధిత కుటుంబాలకు రూ.10వేల నగదు సహాయాన్ని పంపిణీ చేశారు.   సర్కిల్‌ సీవో మురళీ తదితరులు పాల్గొన్నారు.