మంగళవారం 01 డిసెంబర్ 2020
Medchal - Oct 24, 2020 , 06:18:14

శామీర్‌పేట చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలి

శామీర్‌పేట చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలి

శామీర్‌పేట : శామీర్‌పేట చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం శామీర్‌పేట మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ట్రయల్న్‌ పనులను పరిశీలించారు. శామీర్‌పేట చెరువును సందర్శించి కట్టమైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. చెరువులో బండపై ఏర్పాటు చేసిన బంగారు తెలంగాణ అక్షరాల సైజు పెంచాలని, వాకింగ్‌ ట్రాక్‌, పార్కులపై  ప్రజాప్రతినిధులతో చర్చించారు. అనంతరం మండలంలోని అలియాబాద్‌, మూడుచింతల్‌పల్లి రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనితలాలయ్య, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, తహసీల్దార్‌ సురేందర్‌, ఉపసర్పంచ్‌ రమేశ్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుదర్శన్‌, వెంకట్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.