సోమవారం 30 నవంబర్ 2020
Medchal - Oct 22, 2020 , 09:00:16

ఇది ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం

ఇది ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం

మల్కాజిగిరి: ప్రజలు వరదనీటి సమస్యతో  కష్టాలు పడుతున్నారు. ఇది ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం. రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా  సమస్యల పరిష్కారానికి అందరం కృషి చేద్దాం.. అని  మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజిగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..  వరద  ముంపునకు గురైన బాధితులకు అండగా నిలిచేందుకు రాత్రీ, పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, ఆపద సమయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు  ముందుకు వచ్చి ప్రజలకు చేయూతను అందించాలని విజ్ఞాప్తి చేశారు. ఇటీవల యూట్యూబ్‌ చానల్‌లో ప్రసారాలు.. వాటి అనంతరం జరిగిన పరిణామాలు దురదృష్టకరమన్నారు. మీడియా అంటే నాకు అత్యంత గౌరవం ఉందని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించి సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పారు. కొందరు పనిగట్టుకుని ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.  విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్‌ ప్రేమ్‌కుమార్‌, నాయకులు  పిట్ల శ్రీనివాస్‌, జీఎన్‌వీ. సతీశ్‌కుమార్‌, గుండా నిరంజన్‌, రాముయాదవ్‌, గణేశ్‌ ముదిరాజ్‌, మోహన్‌రెడ్డి, ప్రసాద్‌, నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన..

వరద బాధితులకు టీఆర్‌ఎస్‌ సర్కారు ఆపన్న హస్తం అందిస్తున్నది. బుధవారం గౌతంనగర్‌ డివిజన్‌ పరిధిలోని జ్యోతినగర్‌, హనుమాన్‌పేట్‌, ఓల్డ్‌ మిర్జాల్‌గూడ, సాయినగర్‌లోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్‌ శిరిషా జితేందర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు. 

అందుబాటులో ఉండాలి..

రానున్న రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందనీ, లోతట్టు ప్రాంతాల ప్రజలకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు, వార్డు, ఏరియా సభ్యులు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సూచించారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, పట్టణ ఆరోగ్య, పోలీస్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారన్నారు. డీఈ లౌక్య, ఏఈ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్‌.జితేందర్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్‌, మేకల రాముయాదవ్‌, పిట్ల శ్రీనివాస్‌, అనిల్‌ బైరు, శ్రీరామ్‌, రాంచందర్‌, సిద్ధిరాములు, గణేశ్‌ముదిరాజ్‌, సుమలత యాదవ్‌, పరమేశ్‌, కిట్టు, మనోజ్‌, ప్రసాద్‌ యాదవ్‌, జనార్దన్‌, శ్రీనివాస్‌ చారి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం

అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో ముంపునకు గురైన ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకొని తిరిగి పునరావాసం కల్పించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని తుర్కపల్లి, రాజీవ్‌ వీకర్‌ సెక్షన్‌, భూదేవీనగర్‌లో ఆయా డివిజన్‌లకు చెందిన కార్పొరేటర్లు, అల్వాల్‌ సర్కిల్‌ అధ్యక్షుడు కొండల్‌ రెడ్డి, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత, అల్వాల్‌ డిప్యూటీ కమిషనర్‌ తిప్పర్తి యాదయ్యలతో కలసి నగదు సహాయాన్ని అందజేశారు. 

ఉచిత వైద్య శిబిరం..

అల్వాల్‌ డివిజన్‌ పరిధిలోని రాజీవ్‌ వీకర్‌ సెక్షన్‌లోని హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అల్వాల్‌ కార్పొరేటర్‌ చింతల శాంతి శ్రీనివాస్‌ రెడ్డి, మచ్చబొల్లారం కార్పొరేటర్‌ రాజ్‌ జితేందర్‌, అల్వాల్‌ సర్కిల్‌ అధ్యక్షుడు కొండల్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో అల్వాల్‌ డీఈ మహేశ్‌, ఏఈ లక్ష్మి,  టీఆర్‌యస్‌ నాయకులు చింతల శ్రీనివాస్‌ రెడ్డి, జార్జ్‌, కవిత, అరవింద్‌, ప్రేమ్‌, పెంటయ్య, సూర్యకిరణ్‌, బల్వంత్‌ రెడ్డి, రాజసింహా రెడ్డి, దేవేందర్‌, హరిందర్‌, శేఖర్‌, నాగేశ్వర రావు, స్టార్‌ రాజు, సీబీ రవి,  రవి, వెంకట్‌, జ్యోతి యాదవ్‌, అఫ్జల్‌ అక్రం, సత్యనారాయణ, శీల, సదాశివ తదితరులు పాల్గొన్నారు.