ఆదివారం 29 నవంబర్ 2020
Medchal - Oct 20, 2020 , 10:33:28

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

బోడుప్పల్‌ :  సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్‌ నగర పరిధిలోని 4వ డివిజన్‌ లెక్చరర్‌ కాలనీకి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి, శిరీషారెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా వెంకటేశ్వరెడ్డికి రూ.1.25 లక్షలు , శిరీషారెడ్డికి రూ.లక్ష చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను సోమవారం మంత్రి మల్లారెడ్డి బోడుప్పల్‌ నగరపాలక సంస్థ యేయర్‌ సామల బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో లెక్చరర్‌ కాలనీ అధ్యక్షుడు రమణకుమార్‌ పాల్గొన్నారు.

 కీసర మండలానికి చెందిన మరో ఇద్దరికి.. 

కీసర : మండల కేంద్రానికి చెందిన జూపల్లి చంద్రయ్యకు రూ.17,500, నల్ల బాలమ్మకు రూ.24,500 సీఎం సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి మల్లారెడ్డి  సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం జరుగుతుందన్నారు.  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ప్రతి కుటుంబానికి అండగా ఉండి  ఆదుకుంటుందన్నారు. వైఎస్‌ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, మండల అధ్యక్షుడు జె.సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు వెంకటేశ్‌ ముదిరాజ్‌, మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, కృష్ణ, మల్లేశ్‌ పాల్గొన్నారు.