గురువారం 22 అక్టోబర్ 2020
Medchal - Oct 17, 2020 , 09:35:21

గ్రామాల్లో పంట నష్టం

గ్రామాల్లో పంట నష్టం

శామీర్‌పేట : రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మూడుచింతలపల్లి ఎంపీపీ హారికామురళీగౌడ్‌ అన్నారు. మండల పరిధిలోని లక్ష్మాపూర్‌, పోతారం, నారాయణపూర్‌ గ్రామాల్లో శుక్రవారం పర్యటించి వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మూడురోజులుగా కురిసిన వానలతో వరి, పత్తి, కంది, కూరగాయ పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ శాఖ ద్వారా పంట నష్టం అంచనా వేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సువిధ, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ శ్యామల, ఏఈవో జ్యోతి, సర్పంచ్‌లు ఆంజనేయులు, రాంచంద్రయ్య, హరిమోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు నాగరాజు, అఖిలేష్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి దేవేందర్‌, ఈసీ సూర్య, రైతులు, పాల్గొన్నారు.

కీసరలో...

 కీసర : వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పిస్తామని మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ రామిడి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కీసర, కీసరదాయర, రాంపల్లిదాయరలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటలను పరిశీలించిన వారిలో వ్యవసాయాధికారి మాధవీలత, అధికారులు రీతు, వందన, వైస్‌ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, సర్పంచ్‌లు మాధురి వెంకటేశ్‌, ఆండాలుమల్లేశ్‌, రైతు సంఘం సభ్యులు పి. శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, రాంపల్లిదాయర డైరెక్టర్‌ పోచిరెడ్డి పాల్గొన్నారు. 

ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాటీల్లో...

 ఘట్‌కేసర్‌ : ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో నష్టపోయిన వరి పంటను శుక్రవారం వ్యవసాయ అధికారులు సురేష్‌రెడ్డి, బాసిత్‌, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డిగూడ, ఎరిమల్లె వాగు పరిసర ప్రాంతాలు, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, యంనంపేట్‌లో వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని చైర్మన్‌ కొండల్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రెడ్యానాయక్‌, కౌన్సిలర్‌ రాజశేఖర్‌ పేర్కోన్నారు. ఘట్‌కేసర్‌ రైతు సేవా సహకార సంఘం వైస్‌చైర్మన్‌ అనంతరెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

కొర్రెములలో...

ఘట్‌కేసర్‌ రూరల్‌ :  కొర్రెముల గ్రామంలో ముంపునకు గురైన  పంట పొలాలను రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, సర్పంచ్‌ వెంకటేశ్‌ గౌడ్‌  పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళనకు గురి కావద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు భిక్షపతిగౌడ్‌, వ్యవసాయ శాఖాధికారి బాసిత్‌, ఏడీఏ వెంకట్‌ రాంరెడ్డి, ఏఈవోలు జగదీశ్వర్‌, సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు. కొర్రెముల పంచాయతీ మూసీ పరీవాహక ప్రాంతంలో ముంపునకు గురైన పంట పొలాలను మండల వైస్‌ ఎంపీపీ జంగమ్మ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కర్రె జంగయ్య పరిశీలించారు. 

డబిల్‌పూర్‌లో..

 మేడ్చల్‌ రూరల్‌ : మండల పరిధిలోని డబిల్‌పూర్‌ గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న వరి, కంది, పత్తి పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. సర్పంచ్‌ వీర్లపల్లి గీతాభాగ్యారెడ్డి రైతులకు జరిగిన నష్టాన్ని అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఏఈవో సుమిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేశ్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోపని వెంకటేశ్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నేత భాగ్యారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రమేశ్‌, సల్లా కృష్ణ పాల్గొన్నారు. కాగా ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి వ్యవసాయ అధికారులతో పర్యటించి, పంటనష్టం గురించి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నష్ట పరిహారం అందజేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.


logo