శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Medchal - Jul 03, 2020 , 01:37:14

ఠాణాల్లో వనాలు

ఠాణాల్లో వనాలు

        పోలీస్‌స్టేషన్లలో మియావాకి ప్లాంటేషన్‌

రాచకొండ పరిధిలో 49 ఎంపిక

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో 

హెచ్‌ఎండీఏ సన్నాహాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పోలీస్‌ స్టేషన్లు నందనవనాలుగా మారనున్నాయి.  ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకట్టుకోనున్నాయి. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని 49 పోలీస్‌ స్టేషన్ల ఆవరణల్లో చిట్టడవుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆరో విడుతలో యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ను స్ఫూర్తిగా తీసుకుని పోలీస్‌స్టేషన్లలో వనాల ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం శ్రీకారం చుట్టింది. తక్కువ ప్రాంతం.. పరిమిత వ్యయం.. చిక్కని పచ్చదనంతో పోలీస్‌ స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు. వంద ప్రాంతాల్లో మియావాకి పద్ధతిలో మొక్కలు పెంచాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఖాళీ స్థలాలను గుర్తించారు. ఇందులో భాగంగానే తొలుత రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్లను ఎంపిక చేశారు. 

సహజ వనాలు ఇక్కడే..!

మల్కాజిగిరి సీపీ, డీజీపీ కార్యాలయం, జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌/ ఎస్‌వోటీ మల్కాజిగిరి, కీసర, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌ , మల్కాజిగిరి, నాచారం, ఉప్పల్‌ పీఎస్‌/మల్కాజిగిరి ఏసీపీ /డీసీపీ ట్రాఫిక్‌, మేడిపల్లి, ఘట్‌కేసర్‌, మల్కాజిగిరి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, ఎల్బీనగర్‌ డీసీపీ, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పహడీషరీఫ్‌, మీర్‌పేట, బాలాపూర్‌, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఆదిబట్ల, మాడ్గుల, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, సరూర్‌నగర్‌ (ఉమెన్‌), వనస్థలిపురం క్యాంటిన్‌/ఈ-చలాన్‌ పీఎస్‌, ఎల్బీనగర్‌ సీపీ క్యాంపు ఆఫీస్‌, భువనగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌/డీసీపీ కార్యాలయం, భువనగిరి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌/ ఏసీపీ/సర్కిల్‌, రాజపేట, తుర్కపల్లి ఓల్డ్‌ పోలీస్‌స్టేషన్లు, తుర్కపల్లి న్యూ పోలీస్‌స్టేషన్‌, ఆలేరు పోలీస్‌స్టేషన్‌, చౌటుప్పల్‌/ఏసీపీ కార్యాలయం, రామన్నపేట పోలీస్‌స్టేషన్‌/సర్కిల్‌, ఆత్మకూర్‌, మోత్కూరు, వలిగొండ, యాదాద్రి ఓపెన్‌ పోలీస్‌ గ్రౌండ్‌, పోచంపల్లి, సంస్థాన్‌ నారాయణపూర్‌, చౌటుప్పల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, భువనగిరి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లతో పాటు ఔటర్‌లో కండ్లకోయ జంక్షన్‌లో రెండు చోట్ల, దుండిగల్‌, తూంకుంటలో ఔటర్‌లో 22 నుంచి 49 కిలోమీటర్ల మధ్యలో 10 చోట్ల, ఉస్మానియా యూనివర్సిటీలో ఐదు చోట్ల యాదాద్రి మోడల్‌ సహజ వనాల అభివృద్ధికి హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు శ్రీకారం చుట్టారు.

ఆహ్లాదకరంగా..!

ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్లు అంటే కొంత భయానక వాతావరణాన్ని తలపించేవి.  ఎలాంటి వసతులు లేకుండా అధ్వానంగా దర్శనమిచ్చేవి. ఎవరైన ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రక్షకభట నిలయాలన్నీ కార్పొరేట్‌ కార్యాలయాల్లా మారాయి. ఫిర్యాదు చేయాలనుకునే వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ ఏర్పాటుతో ప్రజలకు భరోసా కల్పించారు. ఇప్పుడు పోలీస్‌స్టేషన్లకు సొబగులు అద్దడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. పోలీస్‌ స్టేషన్ల ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించనున్నది.logo