శుక్రవారం 07 ఆగస్టు 2020
Medchal - Jul 03, 2020 , 01:14:23

‘ఆకు పచ్చని తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలి’

‘ఆకు పచ్చని తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలి’


 చిక్కడపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరిత తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆకుపచ్చని తెలంగాణ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని గురువారం గాంధీనగర్‌  డివిజన్‌లోని కెనరా బ్యాంక్‌ పార్కులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్‌ ముఠా పద్మతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు ముఠా నరేశ్‌, రాజ్‌మోహన్‌, ముఠా జయసింహ, ముకుంద్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్త, పురుషోత్తం, రాఖేశ్‌, మాచర్ల పద్మజ, పద్మ, గుండు జగదీశ్‌బాబు, నవీన్‌యాదవ్‌, గడ్డమీది శ్రీనివాస్‌, ఏఈ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.  logo