శనివారం 06 జూన్ 2020
Medchal - May 12, 2020 , 23:59:26

మీ సాయం మరువలేం..

మీ సాయం మరువలేం..

 • టీఆర్‌ఎస్‌కేవీ ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో చార్మినార్‌ పరిధిలో రైతు సమన్వయ సమితి చైర్మన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు, ఆటో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 •  బడంగ్‌పేట మున్సిపల్‌ లిబ్రా ఎన్‌క్లేవ్‌లో మలబార్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో దివ్యాంగులకు, పారిశుధ్య కార్మికులకు, పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్‌లో ఆశ వర్కర్లకు, మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సరుకులు అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు లావణ్య జన్మదినం సందర్భంగా వెయ్యి మాస్కులు తయారు చేసి మంత్రికి అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు కర్రె కృష్ణ ఆటో డ్రైవర్లకు పండ్లు పంపిణీ చేశారు. 
 •  టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు. రాంనగర్‌లో కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, బాపూజీనగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు భిక్షపతి యాదవ్‌ సరుకులు పంపిణీ చేశారు.  టీఆర్‌ఎస్‌ నాయకుడు కల్వగోపి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. 
 •  బౌద్ధనగర్‌ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికులకు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ పౌష్టికాహారం, కోడిగుడ్లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. 
 •  తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ నాయకుడు ఆవుల రవీందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా బాలానగర్‌ వినాయక కాంప్లెక్స్‌లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బియ్యం పంపిణీ చేశారు. 
 •  వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ మిరియాల రాఘవరావు ఆధ్వర్యంలో పీఏనగర్‌ బస్తీలో 450 మందికి, కొండాపూర్‌ డివిజన్‌ సెంట్రల్‌ పార్కు-2 అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అంజయ్యనగర్‌లో 250 మంది పేదలకు ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నిత్యావసర సరుకులు అందజేశారు.
 •  చిలుకానగర్‌లోని సీతారామకాలనీలో టీఆర్‌ఎస్‌ నాయకుడు బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో వలస కూలీలకు, నాచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు మేడల మల్లికార్జున్‌గౌడ్‌, మేడల జ్యోతి ఆధ్వర్యంలో సీఐ మహేశ్‌తో కలిసి, హబ్సిగూడలో శ్రీనివాస షాపింగ్‌ మాల్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ బేతి స్వప్నారెడ్డి, కమలానగర్‌లో కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో, చర్లపల్లి డివిజన్‌ రెడ్డి కాలనీలో టీఆర్‌ఎస్‌ నేత శివకుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సరుకులు పంపిణీ చేశారు. 
 • ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ డివిజన్లలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • బోరబండలో డిప్యూటీ మేయర్‌ బాబాఫసియుద్దీన్‌ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 35కిలోల చొప్పున బియ్యం, సరుకులు అందజేశారు.
 •  గాజులరామారం డివిజన్‌ మెట్‌కానిగూడలో 150 మంది పేదలకు కార్పొరేటర్‌ రావుల శేషగిరిరావుతో కలిసి ఎమ్మెల్యే వివేకానంద్‌ సరుకులు పంపిణీ చేశారు.
 • నిజాంపేట మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో కార్పొరేటర్‌ బాలాజీనాయక్‌ సహకారంతో 25మంది అటెండర్లు, స్వీపర్లకు మున్సిపల్‌ కమిషనర్‌ గోపీ, డిప్యూటీ మేయర్‌ ధన్‌రాజు యాదవ్‌ సరుకులు పంపిణీ చేశారు.
 •   కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ నివాసంలో రెండు ఫూట్‌ ఆపరేటెడ్‌ శానిటైజర్లను ఫాబ్‌ఎక్స్‌ప్రెస్‌ ఇండియా పరిశ్రమ సహకారంతో మాజీ కార్పొరేటర్‌ సురేశ్‌రెడ్డి ఏర్పాటు చేశారు.
 • గోషామహల్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నందకిశోర్‌ వ్యాస్‌, గౌలిగూడలోని గడ్డంగంగాధర్‌ యాదవ్‌ ఫౌండేషన్‌ కార్యాలయంలో ఫౌండేషన్‌ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి బోయిన్‌పల్లిలోని తన నివాసంలో కంటోన్మెంట్‌ నియోజకవర్గం జర్నలిస్టులకు బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి సరుకులు అందజేశారు.
 • విఠల్‌వాడిలో 400మంది పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • నల్లకుంట ఫీవర్‌ దవాఖాన డాక్టర్లు, సిబ్బందికి రాంనగర్‌కు చెందిన సంఘ సేవకుడు రఘువీర్‌ భోజనం అందించగా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌, ఫార్మాసిస్టు జె.అశోక్‌ రఘువీర్‌ను సత్కరించారు. 
 • ఆల్విన్‌కాలనీ డివిజన్‌ పరిధిలోని ఎల్లమ్మబండ సాయినగర్‌లో కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.   
 • కాప్రాలోని ఎల్లారెడ్డిగూడలో బీఎల్‌ఆర్‌ ట్రస్టు చైర్మన్‌ బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 500 మంది పేదలకు సరుకులను కార్పొరేటర్‌ స్వర్ణరాజ్‌ పంపిణీ చేశారు. 
 • చర్లపల్లి పరిధిలోని పుక్కట్‌నగర్‌లో లెప్రా ఇండియా ఆధ్వర్యంలో సుమారు రూ.16లక్షలతో 625 కుటుంబాలకు సంస్థ సీఈవో ఓంప్రకాశ్‌, బీపీహెచ్‌సీ హెడ్‌ డాక్టర్‌ అపర్ణ సరుకులు పంపిణీ చేశారు. 
 • ఎల్బీనగర్‌జోన్‌ పరిధిలోని మున్సిపల్‌ కార్మికుల కోసం ఎన్‌-95 మాస్కులను  జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డికి ఎంపీ రేవంత్‌రెడ్డి, మధురా చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్‌ పరమేశ్వర్‌రెడ్డి అందజేశారు.
 • జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు కాలనీల్లో మేయర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ పేదలకు సరుకులు అందజేశారు. 
 • సైదాబాద్‌ డివిజన్‌ పరిధిలోని కురుమ బస్తీలో 300 మంది పేదలకు ఆ సంఘం నాయకులు డాక్టర్‌ అశోక్‌కుమార్‌, బాలప్ప, అల్లి శ్రావన్‌కుమార్‌ సరుకులు అందజేశారు. 
 • లింగోజిగూడెం డివిజన్‌ మసీదుగల్లీలో ముస్లింలకు ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్త, డివిజన్‌ కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి పండ్లు పంపిణీ చేశారు. 
 • బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆటో డ్రైవర్లకు టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో ఆరెమైసమ్మ ఆలయం వద్ద మేయర్‌ మహేందర్‌గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి, రాంబాబుయాదవ్‌, రాముడుయాదవ్‌ సరుకులు అందజేశారు.
 • తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్‌ మల్లేపల్లి ఐటీఐ పరిసరాల్లో నివసిస్తున్న పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • బర్కత్‌పురలోని రాజధాని కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఆహార పొట్లాలు, సరుకులను బ్యాంకు ఫెడరేషన్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ దయాకర్‌ పంపిణీ చేశారు.


logo