గురువారం 25 ఫిబ్రవరి 2021
Medchal - May 12, 2020 , 23:38:51

కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలి

కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలి

వలిగొండ : కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌కళ్యాణ్‌ సూచించారు. మండలంలోని దుప్పెల్లి, నాతాళ్లగూడెం, వేములకొండ గ్రామాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితులను ఆయన వైద్య సిబ్బందితో కలిసి మంగళవారం తెలుసుకున్నారు. తప్పనిసరిగా 28 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. మాస్కులు ధరించాలని, శానిటైజర్‌, సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు  ఉంటే  వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు.  కార్యక్రమంలో డాక్టర్‌ సుమలత, డాక్టర్‌ జ్యోతి, ఏపీఎంవో సంతోష్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo