గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Mar 08, 2020 , 01:39:46

అనువైన స్థలాల్లో వీధి వ్యాపారాలు

అనువైన స్థలాల్లో వీధి వ్యాపారాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ట్రాఫిక్‌కు ఆటంకం కలుగకుండా.. పర్యావరణానికి హాని లేకుండా.. అనువైన స్థలాల్లో.. వీధి వ్యాపారులకు ఫుడ్‌ వెండింగ్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. చందానగర్‌ సర్కిల్‌లో శిల్పారామం వద్ద రూ. 50 లక్షలతో ఏర్పాటు చేసిన దుకాణాలను  శనివారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు. ఈ  స్టాళ్లకు సౌర విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించారు. 


నగర వాసులకు సుచి,శుభ్రతతో కూడిన ఆహారాన్ని అందజేసేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగాన్ని చేసింది. ఈ మేరకు ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీ సైక్లింగ్‌ చేసి చిన్న పాటి దుకాణాలుగా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా వెండింగ్‌ జోన్‌ నిర్వాహకులకు ఉపాధితో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో ఈ స్టాల్స్‌ ప్రత్యేకతను చాటుకున్నవి. మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా  రూ. 50లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్‌లను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ   తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఈ స్టాల్స్‌లను అం దుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నీరూస్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌ వరకు రోడ్లపక్కన చిన్నచిన్న ఫుడ్‌స్టాల్స్‌ నిర్వహిస్తున్న వీధి వ్యాపారులు, మెటల్‌ చార్మినార్‌ నుంచి హైటెక్స్‌ గేట్‌ వరకు రోడ్ల పక్కన  నిర్వహిస్తున్న వీధి వ్యాపారులకు ఈ ఫుడ్‌ వెండింగ్‌ జోన్‌లో స్టాల్స్‌ను కేటాయించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాం తంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగులు, శిల్పారామానికి వచ్చే పర్యాటకులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు ఈ స్టాల్స్‌ పొందిన వీధి వ్యాపారులకు ఆహార పదార్థాల తయారీ, నాణ్యతపై జీహెచ్‌ఎంసీ ప్రత్యే క శిక్షణనిచ్చింది. ఈ స్టాళ్లకు సోలార్‌ విద్యుత్‌ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 


జంక్షన్ల విస్తరణ, ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల తనిఖీ 

మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి జోన్లలో విస్తృతంగా పర్యటించారు. షేక్‌పేట్‌ దర్గా, జేఆర్‌సీ చౌర స్తా వద్ద చేపట్టిన జంక్షన్‌ అభివృద్ధి పనులు, ఫ్లైఓవర్‌ పనులకు అడ్డుగా ఉన్న  ఆస్తులను వెంటనే సేకరించాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. అలాగే, విద్యుత్‌ స్తం భాల పనులను పూర్తిచేయాలని డిస్కం అధికారులను కోరారు. జేఆర్‌సీ చౌరస్తా వద్ద గచ్చిబౌలి నుంచి బంజారాహిల్స్‌కు వెళ్లే ప్రత్యామ్నాయ రోడ్డును అభివృద్ధి చేసి ట్రాఫిక్‌ను మళ్లించాలని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి జోన్‌లో దర్గా, గచ్చిబౌలి, బొటానికల్‌ గార్డెన్‌, మజీద్‌బండ తదితర ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా చేపట్టిన రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ చందానగర్‌ ఉపకమిషనర్‌ సుధాంష్‌, ప్రాజెక్టు అధికారి వత్సలదేవి, ఈఈ చిన్నారెడ్డి, డీఈ రూపాదేవి, బాల మురళి, ఏఈ ప్రశాంత్‌, మెడికల్‌ ఆఫీసర్‌ రవికుమార్‌, మాదాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, భిక్షపతి ముదిరాజ్‌ మధుసుదన్‌రెడ్డి, గుమ్మడి శ్రీనివాస్‌, రాంచందర్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>