గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Mar 04, 2020 , 01:29:54

‘బీఎస్‌ 4’ రిజిస్ట్రేషన్‌కు బారులు

‘బీఎస్‌ 4’ రిజిస్ట్రేషన్‌కు బారులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :బీఎఎస్‌ వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం నగర ఆర్టీవో కార్యాలయాల్లో వాహనదారులు బారులు తీరుతున్నారు. ఈ నెల 31 చివరితేదీగా ప్రకటించడంతో త్వరగా  రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని క్యూలు కడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు చెప్పినా పర్మినెంట్‌ రిజస్ట్రేషన్‌ చేసుకోకుండా టెంపరరీ(టీఆర్‌) రిజిస్ట్రేషన్లతో వాహనాలు నడుపుతున్న వాహనదారులకు సుప్రీంకోర్టు ఇచ్చిన  తీర్పు కుదేలవుతున్నారు. కాలుష్య నియంత్రణ కోసం తప్పకుండా బీఎస్‌6 వాహనాలు మాత్రమే అమ్మకాలు సాగించాలని ఆదేశాలు జారీచేయడంతో గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని రవాణాశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. గడువుదాటితే రిజిస్ట్రేషన్లు చేయబోమని చెబుతుండటంతో ఇక తప్పదని తెలిసి కార్యాలయాలకు వస్తున్నారు. హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లను బిగించుకోకుండా కేవలం టీఆర్‌ నంబరుతో రోడ్లపై తిరుగుతున్నారు. ఇలా తిరుగుతున్న వాహనాల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా  2 లక్షల వాహనాలున్నట్లు అధికారులు వెల్లడించారు. వాహన డీలర్లు విక్రయించిన వాహన యజమానుల సెల్‌ఫోన్లకు సందేశాలు గత కొద్దిరోజులుగా పంపుతున్నారు. దీనికితోడు రవాణాశాఖ అధికారులు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రతిరోజు నగరంలోని ఒక్కో ఆర్‌టీవో కార్యాలయాల పరిధిలో 70 నుంచి 90 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య రెండింతలకు పైగా పెరిగిందని అధికారులు తెలిపారు. 


logo